Share News

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి..

ABN , Publish Date - Jul 24 , 2026 | 08:22 PM

పాకిస్థాన్‌లోని వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో గురువారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. టాంక్ జిల్లాలోని సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి.. 15 మంది మృతి..
Pakistan bombing

ఇంటర్‌నెట్ డెస్క్: పాకిస్థాన్‌లోని వాయవ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో గురువారం రాత్రి ఆత్మాహుతి దాడి జరిగింది. టాంక్ జిల్లాలోని సెక్యూరిటీ చెక్‌పోస్ట్‌ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఉగ్రవాదులు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో సెక్యూరిటీ చెక్‌పోస్టు రక్షణ గోడను ఢీకొట్టారు. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడి ధాటికి 15 మంది ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో12 మంది సైనికులు, ఇద్దరు పోలీసులు, ఓ అటవీ అధికారి ఉన్నారు.


ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ సైన్యం ప్రతీకార దాడికి దిగింది. 12 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది. ఈ ఉగ్రదాడి చేసింది ఏ గ్రూపు అన్నది తెలియరాలేదు. ఇది తాలిబన్ మిలిటెంట్ గ్రూప్ 'తెహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్' దాడి అయి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ ఆత్మాహుతి దాడిపై పాకిస్థాన్ ఆర్మీ స్పందిస్తూ.. ‘15 మంది వీరపుత్రులు అత్యున్నత త్యాగం చేసి వీరమరణం పొందారు’ అని పేర్కొంది.


ఇవి కూడా చదవండి

మీరు ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉంటున్నారా? కేబినెట్ మంత్రులకు ప్రధాని ప్రశ్న

ఐపీఎల్‌లో కోహ్లీతో హ్యాండ్‌షేక్ వివాదం.. స్పందించిన ట్రావిస్ హెడ్

Updated Date - Jul 24 , 2026 | 08:40 PM