Share News

పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది దుర్మరణం..

ABN , Publish Date - Aug 02 , 2026 | 07:56 AM

పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టూరిస్ట్ విమానం కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది.

పెరూలో ఘోర విమాన ప్రమాదం.. 13 మంది దుర్మరణం..
Peru sightseeing flight

ఇంటర్‌నెట్ డెస్క్: పెరూ దేశంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. పర్యాటకులతో వెళుతున్న టూరిస్ట్ విమానం కుప్పకూలిన ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఈ సంఘటన చోటుచేసుకుంది. నజ్‌కా మున్సిపల్ గవర్నమెంట్ తెలిపిన వివరాల మేరకు.. శనివారం పెరూవియన్ కంపెనీకి చెందిన ఎరోడియానా టూరిస్ట్ విమానం 11 మంది టూరిస్టులు, ఇద్దరు విమాన సిబ్బందితో ఇకా ప్రాంతం నుంచి బయలుదేరింది.


నజ్‌కా సిటీ బయట ఆ విమానం ప్రమాదానికి గురైంది. నేలపై పడి పేలిపోయింది. దీంతో విమానంలోని 13 మంది సజీవ దహనమయ్యారు. చనిపోయిన 11 మంది టూరిస్టులలో ఇద్దరు జర్మన్లు, ఇద్దరు స్పానిష్, ఏడుగురు ఇటాలియన్ వ్యక్తులు ఉన్నారు. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. పెరూవియన్ అధికారులు ఈ సంఘటనపై దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి

ప్రజల్ని చీమలతో పోల్చేవారు జడ్జీలవుతున్నారు!

చిటపట చినుకులు పడుతూ ఉంటే...

Updated Date - Aug 02 , 2026 | 08:10 AM