Share News

హైబీపీతో చాలా జాగ్రత్త.. పట్టించుకోకపోతే ప్రాణాలు అంతే..

ABN , Publish Date - Feb 18 , 2026 | 04:42 PM

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ఇండియాలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైబీపీ కారణంగా గుండె, కిడ్నీ సమస్యలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.

హైబీపీతో చాలా జాగ్రత్త.. పట్టించుకోకపోతే ప్రాణాలు అంతే..
uncontrolled high blood pressure effects

ఇంటర్‌నెట్ డెస్క్: నేటి సమాజంలో చిన్న పిల్లల దగ్గరి నుంచి ముసలివారి వరకు బీపీ (రక్తపోటు) సమస్యలు సర్వ సాధారణం అయిపోయాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. ఇండియాలో 30 నుంచి 79 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతీ ముగ్గురిలో ఒకరు బీపీ సమస్యతో బాధపడుతున్నారు. మరీ ముఖ్యంగా హైబీపీ కారణంగా గుండె, కిడ్నీ సమస్యలు వచ్చి ఎంతో మంది ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. అందుకే హైబీపీని సైలెంట్ కిల్లర్ అని పిలుస్తూ ఉంటారు. హైబీపీ కారణంగా గుండెపై తీవ్ర ప్రభావం పడుతుంది. హార్ట్ ఎటాక్‌లు వచ్చే అవకాశం కూడా ఎక్కువే.


అయితే, హైబీపీ కారణంగా గుండెతో పాటు బ్రెయిన్‌పై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. మెదడు మన శరీర బరువులో కేవలం 2 శాతం మాత్రమే ఉన్నప్పటికి.. 20 శాతం బ్లడ్ సప్లై మెదడుకు జరుగుతుంది. సాధారణంగా హైబీపీ వల్ల రక్త నాళాలు కుంచించుకుపోతాయి. సరైన విధంగా అన్ని అవయవాలకు రక్తం సరఫరా జరగదు. దీని వల్ల మెదడుకు అవసరమైన 20 శాతం బ్లడ్ సప్లైలో అంతరాయం ఏర్పడుతుంది. మెదడులో నరాలు దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది.


గడ్డ కట్టిన రక్తం కుంచించుకుపోయిన ధమనిలో అడ్డుపడ్డా.. రక్త నాళం పగిలిపోయినా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. హైబీపీపై సరైన విధంగా దృష్టి సారించకపోతే పర్మినెంట్ బ్రెయిన్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. పెరాలసిస్‌తో పాటు తీవ్రమైన ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు.. అదుపులో లేని హైబీపీ వల్ల డిమెన్షియా వచ్చే అవకాశం ఎక్కువ. క్రోనిక్ హైపర్‌ టెన్షన్ కారణంగా మెదడుకు రక్తం సరఫరా తగ్గి వాస్క్యూలర్ డిమెన్షియా వచ్చే అవకాశం కూడా ఉంది. హైబీపీ వల్ల తర్వాతి కాలంలో నిర్ణయాలు తీసుకోవటం, మెంటల్ ప్రాసెసింగ్ స్పీడ్‌పై కూడా ప్రభావం పడుతుంది.

Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ఇది కేవలం ప్రజల సాధారణ ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.


ఇవి కూడా చదవండి

‘నన్ను జైలుకు పంపాలనుకుంటే పంపండి’.. బాల్క సుమన్ సవాల్

భాగ్యనగర పరిశుభ్రతలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు: సీఎస్ రామకృష్ణారావు

Updated Date - Feb 18 , 2026 | 05:53 PM