Share News

Nighttime Milk Consumption: ఈ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు అస్సలు తాగకూడదు

ABN , Publish Date - Jan 06 , 2026 | 09:12 AM

టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు కూడా పాలు తాగటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు తాగటం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Nighttime Milk Consumption: ఈ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు అస్సలు తాగకూడదు
Nighttime Milk Consumption

పాలు మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గరినుంచి పెద్ద వారి వరకు ప్రతీ నిత్యం పాలు తాగే వారు లేకపోలేదు. ప్రతీ రోజు ఓ గ్లాసెడు పాలు తాగితే మన శరీరానికి చాలా రకాల పోషకాలు అందుతాయి. పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ప్రతీ రోజు పాలు తాగటం వల్ల మన ఎముకలు, పళ్లు దృఢంగా తయారు అవుతాయి. అయితే, పాలు తాగటం కొంత మందిలో ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉన్నవారు పాలు అస్సలు తాగకూడదు. ఒబేసిటీ ఉన్న వారు కూడా పాలు తాగకూడదు. పాలు తాగితే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సమస్యలు ఉన్న వారు రాత్రి పూట పాలు తాగకపోవటం చాలా ఉత్తమం. సైనస్, జలుబు ఉన్న వారు రాత్రి పూట పాలు, పాల పదార్ధాలు తీసుకోకూడదు. ఒక వేళ పాలు తాగితే మ్యూకస్ ఉత్పత్తి మరింత పెరుగుతుంది. సైనస్, జలుబు సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. అందుకే సైనస్, జలుబు సమస్యలు ఉన్న వారు రాత్రి పూట పాలకు దూరంగా ఉండాలి.


అంతేకాదు.. టైప్ 2 డయాబెటీస్ ఉన్న వారు కూడా పాలు తాగటం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డయాబెటీస్ సమస్య ఉన్నవారు రాత్రి పూట పాలు తాగటం మంచిది కాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. పాలలోని లాక్టోస్ కారణంగా శరీరంలో చక్కెర ఉత్పత్తి పెరుగుతుందని చెబుతున్నారు. గ్యాస్, అజీర్తి, ఎసిడిటీ ఉన్న వారు కూడా రాత్రిపూట పాలు తాగకూడదని డాక్టర్లు అంటున్నారు. పాలు కూడా మితంగా తీసుకుంటే అమృతంలా.. అతిగా తీసుకుంటే విషంలా పని చేస్తాయి.

(Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా మీకు అందించడం జరుగుతుంది. కేవలం మీ అవగాహన కోసమే.. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించలేదు)


ఇవి కూడా చదవండి

మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో 82ల మధ్యనున్న 28ని 5 సెకెన్లలో గుర్తించండి..

బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనడం వల్ల ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

Updated Date - Jan 06 , 2026 | 09:38 AM