వేసవిలో వేడి నీళ్లు తాగొచ్చా?
ABN , Publish Date - Mar 07 , 2026 | 07:43 AM
శరీరానికి అవసరమైనప్పుడు సరైన ఉష్ణోగ్రతలో నీరు తాగితే అది ఔషధంలా పనిచేస్తుంది. వేడి నీరు ఎప్పుడు తాగాలి, సాధారణ నీరు ఎప్పుడు తాగాలి, మరిగించి చల్లార్చిన నీరు ఎప్పుడు తాగాలి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..
ఇంటర్నెట్ డెస్క్: మన శరీరం సరిగ్గా పనిచేయడానికి నీరు అత్యంత అవసరం. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడం నుంచి జీర్ణక్రియను మెరుగుపరచడం వరకు నీరు కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఏ సమయంలో ఎలాంటి నీరు తాగాలి అనే విషయం చాలా మందికి స్పష్టంగా తెలియదు. వేసవిలో చల్లటి నీరు మంచిదా? లేక వేడి నీరు తాగాలా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నీటిని తాగే విధానం పరిస్థితిని బట్టి మారాలి. చల్లటి నీరు, వేడి నీరు, అలాగే మరిగించి చల్లార్చిన నీరు.. ప్రతి ఒక్కదానికి వేర్వేరు ప్రయోజనాలు ఉంటాయి.
చల్లటి నీరు ఎప్పుడు తాగాలి?
శరీరంలో నీరు తగ్గినప్పుడు లేదా అధిక వేడి వల్ల అస్వస్థత కలిగినప్పుడు చల్లటి నీరు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా, ఎక్కువగా చెమటలు పట్టినప్పుడు, తీవ్ర దాహం వేస్తున్నప్పుడు, ఎండలో ఎక్కువసేపు ఉన్నప్పుడు, వాంతులు లేదా అలసటగా అనిపించినప్పుడు.. అలాంటి పరిస్థితుల్లో చల్లటి నీరు తాగడం వల్ల శరీరానికి త్వరగా ఉపశమనం లభిస్తుంది.
వేడి నీరు ఎప్పుడు తాగాలి?
జీర్ణక్రియ బలహీనంగా ఉన్నప్పుడు వేడి నీరు తాగడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే, అజీర్ణం సమస్య ఉన్నప్పుడు, కఫం, జలుబు లేదా గొంతు నొప్పి ఉన్నప్పుడు, శరీరంలో విషపదార్థాలను బయటకు పంపించాలనుకున్నప్పుడు, మరిగించిన నీటిని కొద్దికొద్దిగా తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటమే కాకుండా శరీరం తేలికగా అనిపిస్తుంది.
మరిగించి చల్లార్చిన నీటి ప్రయోజనాలు
నీటిని ముందుగా మరిగించి తర్వాత చల్లార్చి తాగడం ఆయుర్వేదంలో చాలా మంచిదిగా భావిస్తారు. ఈ విధంగా తాగితే శరీరంలోని వాతం, పిత్తం, కఫం వంటి దోషాలు సమతుల్యంగా ఉండటానికి సహాయపడుతుంది. అలాగే ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీటిని తాగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. చాలా కాలం నిల్వ ఉంచిన నీరు శరీరంలో అసమతుల్యతను పెంచి అనారోగ్యానికి కారణమయ్యే అవకాశముంది.
సింపుల్‌గా చెప్పాలంటే, నీరు తాగే విధానం కూడా ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. పరిస్థితిని బట్టి చల్లటి నీరు లేదా వేడి నీరు తాగాలి. సాధారణంగా మరిగించి చల్లార్చిన నీరు తాగడం ఆరోగ్యానికి మంచి ఎంపికగా నిపుణులు సూచిస్తున్నారు.
Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
ఈ వార్తలు కూడా చదవండి..
విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి
కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?
For More Latest News