Share News

అరచేతులకు చెమట పట్టడానికి ప్రధాన కారణాలు..

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:35 PM

అరచేతులకు తరచుగా చెమట పట్టడం చాలా మంది సాధారణ సమస్యగా భావిస్తారు. అయితే ఎటువంటి కారణం లేకుండా ఎప్పుడూ చేతులు చెమట పడుతుంటే, అది హైపర్ హైడ్రోసిస్ అనే ఆరోగ్య సమస్యకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అరచేతులకు చెమట పట్టడానికి ప్రధాన కారణాలు..
Sweaty Palms Causes

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి అరచేతులు చెమట పట్టడం సాధారణమే. ముఖ్యంగా వేసవిలో, టెన్షన్‌గా ఉన్నప్పుడు లేదా భయపడినప్పుడు ఇలా జరుగుతుంది. కానీ ఎటువంటి కారణం లేకుండానే తరచుగా చేతులు చెమట పడుతుంటే, దాన్ని నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని హైపర్ హైడ్రోసిస్ (Hyperhidrosis) అంటారు. ఇది ప్రాణాపాయం కలిగించకపోయినా, రోజువారీ జీవితంలో అసౌకర్యాన్ని కలిగిస్తుంది.


అరచేతులు చెమట పట్టడానికి ప్రధాన కారణాలు

  • మన శరీరంలో స్వేద గ్రంథులు చెమటను ఉత్పత్తి చేస్తాయి. ఇవి ఎక్కువగా పని చేస్తే అర చేతులకు ఎక్కువ చెమట పడుతుంది.

  • థైరాయిడ్ గ్రంథి ఎక్కువగా పనిచేసినప్పుడు శరీరంలో జీవక్రియ పెరుగుతుంది. దీనివల్ల చేతులు, కాళ్లకు చెమట పట్టే అవకాశం ఉంటుంది.

  • రక్తంలో చక్కెర అకస్మాత్తుగా తగ్గినప్పుడు కూడా చేతులకు చెమట పట్టవచ్చు. ముఖ్యంగా మధుమేహం సమస్యతో బాధపడేవారిలో కనిపిస్తుంది.

  • టెన్షన్, భయం, ఆందోళన ఉన్నప్పుడు నాడీ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. దీనివల్ల అరచేతులకు చెమటలు పడతాయి.

  • కొందరికి ఈ సమస్య వారసత్వంగా కూడా వస్తుంది.


సమస్యను తగ్గించడానికి మార్గాలు

  • డాక్టర్ సూచించిన మందులను క్రమం తప్పకుండా తీసుకోవాలి.

  • చేతులను శుభ్రంగా, పొడిగా ఉంచుకోవాలి.

  • కెఫిన్, కారంగా ఉన్న ఆహారం తగ్గించాలి.

  • ఒత్తిడి తగ్గించే వ్యాయామాలు చేయాలి.


చేతులకు చెమట పట్టడంతో పాటు బరువు తగ్గడం, గుండె వేగంగా కొట్టుకోవడం, రాత్రిళ్లు చెమటలు పట్టడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. ముఖ్యంగా, తరచుగా అరచేతులకు చెమటలు వస్తే అది సాధారణ సమస్య కాకపోవచ్చు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్యను నియంత్రించవచ్చు.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

ఈ వార్తలు కూడా చదవండి..

విటమిన్ డి సప్లిమెంట్లు తీసుకుంటున్నారా? ఇది తెలుసుకోండి

కంటి నొప్పి మెదడు సమస్యకు సంకేతమా?

For More Health News

Updated Date - Feb 28 , 2026 | 05:59 PM