Share News

వీఐటీఈఈఈ 2026 పరీక్షలు ప్రారంభం..

ABN , Publish Date - Apr 28 , 2026 | 02:49 AM

అమరావతిలోని విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష వీఐటీఈఈఈ 2026 ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఈ పరీక్షకు వేలాది మంది విద్యార్థులు హాజరవుతున్నారు. మే 3 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

వీఐటీఈఈఈ 2026 పరీక్షలు ప్రారంభం..
VITEEE 2026 Exams

అమరావతి: విఐటి-ఏపీ విశ్వవిద్యాలయంలో వీఐటీఈఈఈ 2026 ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 28న ప్రారంభమైంది. ఇది దేశవ్యాప్తంగా అత్యంత ప్రాధాన్యత గల ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలలో ఒకటి. ఈ పరీక్షను కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష ద్వారా వెల్లూరు, చెన్నై, అమరావతి, భోపాల్‌లోని విఐటి క్యాంపస్‌లలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు.


ఈ సందర్భంగా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డా. పి. అరుళ్మొళివర్మన్ మాట్లాడుతూ, ఈ పరీక్ష మే 3, 2026 వరకు దేశవ్యాప్తంగా అనేక కేంద్రాలలో జరుగుతుందని తెలిపారు. ఈ సంవత్సరం భారత్‌లోని 129 నగరాల్లో 212 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, సింగపూర్, ఖతార్, మస్కట్, దుబాయ్, కువైట్, అల్ మనామా, అబుదాబి, మలేషియా, షార్జా వంటి 9 అంతర్జాతీయ కేంద్రాలలో కూడా అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. ఫలితాలు మే రెండవ వారంలో ప్రకటించనున్నట్లు తెలిపారు.


రిజిస్ట్రార్ డా. జగదీష్ చంద్ర ముదిగంటి మాట్లాడుతూ, విఐటీఈఈఈతో పాటు ఎం.టెక్, ఎంబిఏ, లా వంటి కోర్సుల ప్రవేశ పరీక్షలు కూడా ఏప్రిల్ 28 - మే 3 వరకు జరగనున్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా పెద్ద సంఖ్యలో విద్యార్థులు పరీక్ష రాస్తున్నారన్నారు. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా విజయవాడ, గుంటూరు నుంచి రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

డిప్యూటీ డైరెక్టర్ (అడ్మిషన్స్) డా. జాన్ ప్రదీప్ మాట్లాడుతూ, 1.5 లక్షల వరకు ర్యాంక్ సాధించిన వారు ఆన్‌లైన్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చన్నారు. ఈ కౌన్సెలింగ్ మే–జూన్ మధ్య జరుగుతుందని, మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని సూచించారు.


Also Read:

డబ్లిన్‌లో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు

ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధి జయరాం: నోరి దత్తాత్రేయుడు

For More Latest News

Updated Date - Apr 29 , 2026 | 01:35 PM