Share News

ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధి జయరాం: నోరి దత్తాత్రేయుడు

ABN , Publish Date - Apr 27 , 2026 | 10:08 PM

ఉత్తర అమెరికా‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26న ఆత్మీయ సమావేశం జరిగింది.

ప్రభుత్వం, ప్రవాసుల మధ్య వారధి జయరాం: నోరి దత్తాత్రేయుడు
Jayaram Komati Felicitation

ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా‌లో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాంను సత్కరించేందుకు ఫిలడెల్ఫియా నగరంలో ఏప్రిల్ 26న ఆత్మీయ సమావేశం జరిగింది. పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమాన్ని రవి పొట్లూరి సమన్వయపరిచారు.

ఈ సందర్భంగా నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. నాలుగున్నర దశాబ్దాలుగా తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ తెలుగుజాతి ఔన్నత్యాన్ని అమెరికాలో జయరాం నిలబెట్టారని కొనియాడారు. ‘నాకు చిన్నతనం నుంచి ఎన్టీఆర్ అంటే అభిమానం. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సలహా మేరకే హైదరాబాద్‌లో క్యాన్సర్ ఆసుపత్రికి బీజం పడింది. ఎన్టీఆర్, చంద్రబాబు కుటుంబాలతో గత ఐదు దశాబ్దాలుగా సన్నిహితంగా మెలుగుతూ వస్తున్నాను. ఈ విషయాన్ని అనేకసార్లు చంద్రబాబు గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆహార అలవాట్లను మార్చుకోవడం ద్వారా ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను నివారించవచ్చు. ప్రజలకు అవగాహన కల్పిస్తే ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను నివారించవచ్చు’ అని తెలిపారు.

8.jpg


జయరాం కోమటి మాట్లాడుతూ... ప్రవాసాంధ్రుల్లో ఒకడిగా ఉన్నందుకే తనకు ఈ అవకాశం లభించిందని అన్నారు. సీఎం చంద్రబాబు తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో సాంకేతిక విద్యను అందించడానికి ప్రవాసులుగా జన్మభూమి రుణం తీర్చుకుందామని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గూగుల్ డేటా సెంటర్ లాంటి సంస్థలు ఏపీకి రావడం జరిగిందని అన్నారు. సాంకేతిక విద్యను అందిస్తే వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.

7.jpg

ఈ కార్యక్రమంలో మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ మన్నవ సుబ్బారావు, శ్రీధర్ అప్పసాని, రాధాకృష్ణ మూల్పురి, రంజిత్ కోమటి, మురళి పమిడిముక్కల, ఫణి కంతేటి, శ్రీధర్ సాదినేని, నందగిరీష్ మూల్పూరి, నాగరాజు చింతం, సురేష్ యలమంచిలి, గోపి వాగ్వాల, హరి దుంగతావుల, విశ్వనాథ్ కోగంటి, లావా ఐనంపూడి, గౌరి కొర్రోతు, భాను మాగలూరి, సాయి బొల్లినేని, మధు ముప్పాల, శ్రీధర్ వీరమాచినేని, శ్రీహరి మందడి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోమటి జయరాంను, నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టీస్ ఎన్.వి. రమణలు ఇచ్చిన సందేశాన్ని ఏవీ ద్వారా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రవాసాంధ్రులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

రాష్ట్రాభివృద్ధిలో ఎన్నారైలు భాగస్వాములు కావాలి: ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం

తానా న్యూజెర్సీ.. ఘనంగా 'మర్మ థెరపీ ఫర్ పెయిన్ మేనేజ్‌మెంట్' కార్యక్రమం

Updated Date - Apr 28 , 2026 | 07:49 AM