HCU: పేలుడు పదార్థాల పరిశోధనలో హెచ్‌సీయూకు గుర్తింపు
ABN , Publish Date - Jan 06 , 2026 | 07:22 AM
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(హెచ్‌సీయూ)కి పేలుడు పదార్థాల పరిశోధనలో గుర్తింపు లభించింది. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ క్యూ1 కేటగిరీకి చెందిన ‘ఐఈఈఈ సెన్సార్ జర్నల్’లో ప్రచురితం కావడంతో మరోమారు హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ సిటీ: టెరాహెర్జ్ట్ రాడార్ ప్రోటోటైప్ సహకారంతో పేలుడు పదార్థాలు, లోహ వస్తువులను గుర్తించవచ్చునని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం(University of Hyderabad) పరిశోధకులు పేర్కొంటున్నారు. యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఫిజిక్స్‌కు చెందిన పరిశోధక బృందం 0.3 టెరాహెర్ట్జ్ రాడార్ వ్యవస్థను ఉపయోగించి లోహ వస్తువుల రాడార్ క్రాస్ సెక్షన్ల (టీఆర్‌సీఎస్)పై చేసిన పరిశోధన విజయవంతమైంది. పరిశోధన ఫలితాలు అంతర్జాతీయ క్యూ1 కేటగిరీకి చెందిన ‘ఐఈఈఈ సెన్సార్ జర్నల్’లో ప్రచురితం కావడంతో మరోమారు హెచ్‌సీయూకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఉన్నతాధికారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్‌సీఎస్ లక్షణాల నిర్ధారణ
ఈ పరిశోధనకు సీనియర్ ప్రొఫెసర్ అనిల్ కుమార్ చౌదరి నాయకత్వం వహించగా, రీసెర్చ్ స్కాలర్ చందన్ ఘోరుయీ ప్రధానపాత్ర పోషించారు. 0.3 టెరాహెర్ట్జ్ సిలికాన్-జర్మేనియం రాడార్ సిస్టమ్‌ను ఉపయోగించి, స్టాండ్ ఆఫ్ మోడ్‌లో కానానికల్ మెటాలిక్ ఆబ్జెక్టుల టీఆర్‌సీఎ్‌సను కొలవడంలో తమ వ్యవస్థ పనితీరును నిరూపించినట్లు వారు పేర్కొన్నారు. గుండ్రని ఫ్లాట్ ప్లేట్లు, పరిమిత పొడవు గల సిలిండర్లు, ఎలిప్టికల్ టార్గెట్లు వంటి కానానికల్ వస్తువుల టీఆర్‌సీఎస్ లక్షణాలను విజయవంతంగా నిర్ధారించామన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
పసిడి ప్రియులకు అలర్ట్.. మరింత పెరిగిన బంగారం ధర..
బీసీ కులగణనపై ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేశారా..
Read Latest Telangana News and National News