కేంద్రీయ విద్యాలయ బాలవాటిక లాటరీ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేయండి..
ABN , Publish Date - Apr 08 , 2026 | 06:15 PM
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బాలవాటిక’ ప్రవేశాల తాత్కాలిక లాటరీ ఫలితాన్ని విడుదల చేసింది. వివరాల్లోకి వెళితే..
ఇంటర్నెట్ డెస్క్: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (KVS) 2026-27 విద్యా సంవత్సరానికి గాను ‘బాలవాటిక’ ప్రవేశాల తాత్కాలిక లాటరీ ఫలితాన్ని విడుదల చేసింది. తాజాగా విడుదలైన తాత్కాలిక ఫలితాల జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లైన kvsangathan.nic.in లేదా admission.kvs.gov.in ద్వారా విద్యార్థి అడ్మిషన్‌ని తనిఖీ చేసుకోవచ్చు. ఇటీవల కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ప్రాథమిక పాఠశాల విద్య కోసం ప్రవేశపెట్టిన 'బాలవాటిక' ప్రోగ్రామ్ పట్ల తల్లిదండ్రులలో ఆసక్తి నెలకొంది. అందుకే తమ పిల్లలను ‘బాలవాటిక’ ప్రవేశాల కోసం సిద్ధం చేస్తున్నారు.
కేంద్రీయ విద్యాలయం రిలీజ్ చేసిన తాత్కాలిక జాబితాలో ఎంపికైన అభ్యర్ధులు, వెయిటింగ్ లీస్ట్‌లో ఉన్న దరఖాస్తుదారులు ఇద్దరూ ఉంటారు. పత్రాల పరిశీలన తర్వాత, సంబంధిత విద్యాలయాలు షార్ట్ లీస్ట్ చేయబడిన విద్యార్థుల ప్రవేశాన్ని ఖరారు చేస్తాయి. ఇప్పటి వరకు ఎంపిక చేసిన ప్రాంతాలకు మాత్రమే ఫలితాలు ప్రకటించబడ్డాయి. కేరళ, పుదుచ్చేరి, అస్సాం వంటి రాష్ట్రాల్లో బాలవాటిక, ఒకటో తరగతి లాటరీ ఫలితాలు ఏప్రిల్ 10న ప్రకటించబడతాయి. అయితే, ఒకటో తరగతి ప్రవేశాల తాత్కాలిక జాబిత ఏప్రిల్ 9న రిలీజ్ చేయనున్నారు. రెండవ, మూడవ తాత్కాలిక జాబితాలు వరుసగా ఏప్రిల్ 16, 21వ తేదీలో విడుదల చేయబడతాయని అధికారుల తెలిపారు. ఏప్రిల్ 22 నుంచి ఏప్రిల్ 26 వరకు ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్లు నిర్వహించబడతాయి. బాలవాటిక, 2వ తరగతి ఆపై తరగతులకు ప్రవేశాలకు ఏప్రిల్ 15 నుంచి ఏప్రిల్ 20 మధ్య జరుగుతాయన్నారు అధికారులు. కాగా, 11వ తరగతి మినహా మిగతా ప్రవేశాలను పూర్తి చేయడానికి చివరి గడువు జూన్ 30, 2026 అని అధికారులు తెలిపారు.
KVS బాలవాటిక లాటరీ ఫలితం 2026ను ఎలా తనిఖీ చేయాలి:
అధికారిక వెబ్‌సైట్, kvsangathan.nic.in లింక్ ను ఓపెన్ చేయాలి.
అడ్మిషన్లు 2026-27 విభాగంపై క్లిక్ చేయండి
బాలవాటిక తాత్కాలిక ఎంపిక జాబితా 2026 లేదా లాటరీ ఫలితం 2026 కోసం లింక్‌ను ఎంచుకోండి
సంబంధిత ప్రాంతం, పాఠశాలను ఎంచుకోండి
రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఉపయోగించి సర్చ్ చేయండి.
మీకు కనిపిస్తున్న ఫలితాలను PDFను డౌన్‌లోడ్ చేసుకోండి
ప్రవేశానికి అవసరమైన పత్రాలు:
ప్రవేశ నిర్ధారణ సమయంలో తల్లిదండ్రులు అవసరమైన పత్రాలను తీసుకురావాలి. వాటిలో ఇవి ఉంటాయి:
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫారం యొక్క కాపీ
బిడ్డ జనన ధృవీకరణ పత్రం
వర్తిస్తే, కేటగిరీ సర్టిఫికేట్ (ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ-ఎన్‌సీఎల్/ఈడబ్ల్యూఎస్/బీపీఎల్/ఎస్‌జీసీ/వికలాంగులు),
నివాస రుజువు (RTE దరఖాస్తుదారుల కోసం)
అభ్యర్థి యొక్క ఆధార్ కార్డు
వైద్య లేదా రక్త సమూహ నివేదిక
ప్రాంతాల వారీగా అప్‌డేట్‌లు, తదుపరి ప్రవేశ సూచనల కోసం తల్లిదండ్రులు అధికారిక KVS వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని అధికారులు సూచించారు.
ఇవి కూడా చదవండి..
గోవాలోని పోండా ఉపఎన్నిక రద్దు... ఈసీ నోటీఫికేషన్ చెల్లదని ప్రకటించిన హైకోర్టు
ఈసీతో టీఎంసీ సమావేశంలో రసాభాస.. పరస్పరం ఆరోపణలు