డిగ్రీ పూర్తి చేశారా? పీఎన్‌బీలో ఉద్యోగ అవకాశం..
ABN , Publish Date - Jul 24 , 2026 | 05:26 PM
బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) గుడ్ న్యూస్ అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) మంచి అవకాశం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ శాఖల్లో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 545 ఖాళీలను భర్తీ చేయనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని బ్యాంక్ సూచించింది.
తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న రాష్ట్రానికి మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
పోస్టుల వివరాలు
పోస్టు పేరు: లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO)
మొత్తం ఖాళీలు: 545
రాష్ట్రాల వారీగా ఖాళీలు
ఆంధ్రప్రదేశ్: 4
తెలంగాణ: 41
గుజరాత్: 77
కర్ణాటక: 78
మహారాష్ట్ర: 67
తమిళనాడు: 51
పశ్చిమ బెంగాల్: 80
జమ్మూ & కశ్మీర్: 9
లద్దాఖ్: 2
అరుణాచల్ ప్రదేశ్: 4
అసోం: 85
మణిపూర్: 6
మేఘాలయ: 8
మిజోరం: 5
నాగాలాండ్: 5
సిక్కిం: 5
త్రిపుర: 18
అర్హతలు
అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే ఆర్‌బీఐ గుర్తింపు పొందిన కమర్షియల్ బ్యాంక్ లేదా రీజినల్ రూరల్ బ్యాంక్‌లో కనీసం ఒక సంవత్సరం పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసే రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడడం వచ్చి ఉండాలి. ఒక అభ్యర్థి ఒక రాష్ట్రంలోని పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేయాలి.
వయో పరిమితి
2026 జులై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ నిబంధనల ప్రకారం:
ఎస్సీ/ఎస్టీలకు 5 సంవత్సరాలు
ఓబీసీలకు 3 సంవత్సరాలు
దివ్యాంగులకు 10 సంవత్సరాలు
మాజీ సైనికులకు 5 సంవత్సరాలు
వయో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ నాలుగు దశల్లో ఉంటుంది.
ఆన్‌లైన్ రాత పరీక్ష
ఇంటర్వ్యూ
డాక్యుమెంట్ వెరిఫికేషన్
స్థానిక భాష పరీక్ష
అన్ని దశల్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.
పరీక్ష విధానం
ఆన్‌లైన్ పరీక్ష మొత్తం 150 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం 180 నిమిషాలు.
విభాగాలు:
రీజనింగ్ & కంప్యూటర్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలు (25 మార్కులు)
డేటా అనాలసిస్ & ఇంటర్‌ప్రిటేషన్: 25 ప్రశ్నలు (25 మార్కులు)
ఇంగ్లీష్ లాంగ్వేజ్: 25 ప్రశ్నలు (25 మార్కులు)
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 25 ప్రశ్నలు (25 మార్కులు)
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్‌నెస్: 50 ప్రశ్నలు (50 మార్కులు)
తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.
జీతం వివరాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం లభిస్తుంది.
పరీక్ష కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్: విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, ఒంగోలు
తెలంగాణ: హైదరాబాద్, వరంగల్, మహబూబ్‌నగర్, కరీంనగర్, ఖమ్మం
దరఖాస్తు ఫీజు
ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు: రూ.59
ఇతర అభ్యర్థులు: రూ.1,180
దరఖాస్తు విధానం
అభ్యర్థులు పీఎన్‌బీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్లై చేయాలి.
దరఖాస్తు ప్రక్రియ:
ముందుగా రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి.
వచ్చిన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
LBO రిక్రూట్‌మెంట్ అప్లికేషన్ ఫామ్‌ను పూర్తి చేయాలి.
అవసరమైన వివరాలు నమోదు చేసి ఫీజు చెల్లించాలి.
అప్లికేషన్‌ను సబ్మిట్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు
దరఖాస్తుకు చివరి తేదీ: ఆగస్టు 9, 2026
ఆన్‌లైన్ పరీక్ష: ఆగస్టు/సెప్టెంబర్ 2026
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకం మంచి అవకాశంగా నిలవనుంది.
Also Read:
ఫ్రిజ్ లేకుండానే టమోటాలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలా?
ఈ తేదీల్లో పుట్టినవారిది రాజసమైన వ్యక్తిత్వం..!