Share News

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం

ABN , Publish Date - Jul 20 , 2026 | 04:30 PM

ఇస్రోలో ఉద్యోగం చేయాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించే అవకాశం.. పరీక్ష లేకుండానే ఉద్యోగం
ISRO VSSC Apprentice Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో శిక్షణ పొందాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. ఇస్రోకు చెందిన విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSC) 2026-27 సంవత్సరానికి అప్రెంటిస్‌ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌, టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ అప్రెంటిస్‌ శిక్షణ ద్వారా అభ్యర్థులు అంతరిక్ష పరిశోధన రంగంలో సాంకేతిక అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది.


మొత్తం ఖాళీలు: 460

గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌ ట్రైనీ పోస్టులు: 273

  • ఏరోనాటికల్‌/ఏరోస్పేస్‌ ఇంజినీరింగ్‌ - 15

  • కెమికల్‌ ఇంజినీరింగ్‌ - 10

  • సివిల్‌ ఇంజినీరింగ్‌ - 12

  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ - 20

  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ - 12

  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ - 43

  • మెకానికల్‌ ఇంజినీరింగ్‌ - 45

  • మెటలర్జీ - 6

  • ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ - 4

  • ఫైర్‌ అండ్‌ సేఫ్టీ - 2

  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌ - 4

  • నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్స్‌ - 10

టెక్నీషియన్ అప్రెంటిస్‌ పోస్టులు: 187

  • ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ - 8

  • కెమికల్‌ ఇంజినీరింగ్‌ - 25

  • సివిల్‌ ఇంజినీరింగ్‌ - 8

  • కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ - 15

  • ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ - 10

  • ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ - 40

  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ - 6

  • మెకానికల్‌ - 50

  • డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌ - 25


అర్హతలు

అభ్యర్థులు పోస్టులను బట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుంచి:

  • బీఈ/బీటెక్‌

  • ఇంజినీరింగ్‌ డిప్లొమా

  • నాన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ

  • హోటల్‌ మేనేజ్‌మెంట్‌/కేటరింగ్‌ టెక్నాలజీ

  • డిప్లొమా ఇన్‌ కమర్షియల్‌ ప్రాక్టీస్‌

వంటి కోర్సులు పూర్తి చేసి ఉండాలి.

వీళ్లు అర్హులు కాదు

కింది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదు:

  • ఏప్రిల్‌ 2022కు ముందే డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసిన వారు

  • ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న వారు

  • ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వారు

  • ఎంటెక్‌ చదువుతున్న వారు

  • డిగ్రీ పూర్తి చేసి 5 సంవత్సరాలు దాటిన వారు

  • ఇప్పటికే అప్రెంటిస్‌ శిక్షణ పొందిన వారు


వయోపరిమితి

2026 జులై 31 నాటికి:

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్‌/నాన్‌ ఇంజినీరింగ్‌): 28 నుంచి 33 ఏళ్లు

  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌ (ఇంజినీరింగ్‌ డిప్లొమా): 30 నుంచి 35 ఏళ్లు

  • కమర్షియల్‌ ప్రాక్టీస్‌ టెక్నీషియన్‌ అప్రెంటిస్‌: 26 నుంచి 31 ఏళ్లు

  • దివ్యాంగ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం

  • ఈ అప్రెంటిస్‌ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేదా ఇంటర్వ్యూ ఉండదు. అభ్యర్థులను మెరిట్‌ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.

  • బోర్డ్‌ ఆఫ్‌ అప్రెంటిస్‌షిప్‌ ట్రైనింగ్‌ పరిధిలోకి వచ్చే ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాల అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.

శిక్షణ కాలం, స్టైపెండ్

  • శిక్షణ వ్యవధి: 1 సంవత్సరం

  • గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు నెలకు: రూ.12,300

  • టెక్నీషియన్‌ అప్రెంటిస్‌కు నెలకు: రూ.10,900

దరఖాస్తు విధానం

  • ఈ పోస్టులకు ఆన్‌లైన్‌ లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసే అవకాశం లేదు. కేవలం వాక్‌-ఇన్‌ సెలక్షన్‌ డ్రైవ్‌ ద్వారా మాత్రమే ఎంపిక జరుగుతుంది.

  • అభ్యర్థులు అవసరమైన ధ్రువపత్రాలతో నిర్ణీత తేదీన హాజరు కావాలి.

అవసరమైన ధ్రువపత్రాలు

  • డిగ్రీ/డిప్లొమా సర్టిఫికెట్లు

  • సెమిస్టర్‌ వారీ మార్కుల జాబితా

  • ఎస్‌ఎస్‌సీ మెమో

  • కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే)

వాక్‌-ఇన్‌ సెలక్షన్‌ వేదిక

కార్తీక తిరునాళ్‌ గవర్నమెంట్ వీ అండ్‌ జీహెచ్‌ఎస్‌ఎస్‌ ఫర్‌ గర్ల్స్‌, మణకాడు, తిరువనంతపురం జిల్లా, కేరళలో ఏర్పాటు చేసిన వీఎస్‌ఎస్‌సీ పెవిలియన్‌ను సందర్శించాలి.

వాక్‌-ఇన్‌ సెలక్షన్‌ తేదీ, సమయం

  • జులై 25, 2026

  • ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు

ఇస్రోలో కెరీర్‌ ప్రారంభించాలనుకునే యువతకు ఈ అప్రెంటిస్‌ శిక్షణ మంచి అవకాశం కానుంది.

Updated Date - Jul 20 , 2026 | 04:32 PM