Share News

ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 పోస్టులు.. ఇలా అప్లై చేయండి

ABN , Publish Date - Jun 17 , 2026 | 12:17 PM

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) కింద మొత్తం 529 ఖాళీల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 పోస్టులు.. ఇలా అప్లై చేయండి
APMSRB Recruitment 2026

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 529 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య సేవల నియామక బోర్డు (APMSRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ల పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.


ఖాళీల వివరాలు

  • స్టాఫ్ నర్స్ – 419 పోస్టులు

  • ఫార్మసిస్ట్ – 24 పోస్టులు

  • మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ (NPHCE) – 86 పోస్టులు

మొత్తం పోస్టులు: 529


అర్హతలు

స్టాఫ్ నర్స్

బీఎస్సీ నర్సింగ్ లేదా జీఎన్‌ఎం (General Nursing & Midwifery) పూర్తి చేసి ఉండాలి. అదనంగా చెల్లుబాటు అయ్యే APNMC రిజిస్ట్రేషన్ తప్పనిసరి.

ఫార్మసిస్ట్

డీ.ఫార్మసీ, బీ.ఫార్మసీ లేదా ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ సంబంధిత కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్‌లో నమోదు ఉండాలి.

మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్

ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి.


వయోపరిమితి

2026 జనవరి 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వయోసడలింపులు:

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు – 5 సంవత్సరాలు

  • దివ్యాంగులకు – 10 సంవత్సరాలు

వేతనాలు

  • స్టాఫ్ నర్స్ – నెలకు రూ.27,675

  • ఫార్మసిస్ట్ – నెలకు రూ.23,393

  • మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ – నెలకు రూ.23,494


ఎంపిక విధానం

ఈ నియామకాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. అభ్యర్థుల విద్యార్హతల్లో సాధించిన మార్కులు, మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక చేపడతారు.

దరఖాస్తు ఫీజు

  • ఓసీ అభ్యర్థులు – రూ.1,200

  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు – రూ.900

ముఖ్యమైన తేదీ

  • ఆన్‌లైన్ దరఖాస్తుల చివరి తేదీ: జూన్ 30, 2026

అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి, అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని నిర్ణీత గడువులోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.


Also Read:

రోడ్డు ప్రమాద బాధితులను చూసి చలించిపోయిన హోం మంత్రి అనిత

మొదటి పరిచయంలోనే ఇలా నమ్మకం గెలవండి

Updated Date - Jun 17 , 2026 | 12:19 PM