ఏపీ జెన్‌కోలో AEE ఉద్యోగాలు..
ABN , Publish Date - Jun 29 , 2026 | 05:00 PM
ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీ జెన్‌కో శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (APGENCO) శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న 100 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (AEE) పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు జూన్ 30 నుంచి జులై 20, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు
AEE (ఎలక్ట్రికల్) – 52 పోస్టులు
AEE (మెకానికల్) – 21 పోస్టులు
AEE (సివిల్) – 20 పోస్టులు
AEE (ఎలక్ట్రానిక్స్) – 7 పోస్టులు
మొత్తం ఖాళీలు: 100
అర్హతలు
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు AICTE లేదా UGC గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్/ఏఎంఐఈ డిగ్రీ లేదా సమాన అర్హతను కలిగి ఉండాలి.
వయోపరిమితి
కనిష్ఠ వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ఠ వయస్సు: 42 సంవత్సరాలు (జులై 1, 2026 నాటికి)
వయో సడలింపు:
SC/ST/BC/EWS అభ్యర్థులకు – 5 సంవత్సరాలు
PwBD అభ్యర్థులకు – 10 సంవత్సరాలు
జీతం
ఎంపికైన అభ్యర్థులకు ప్రొబేషన్ కాలంలో నెలకు రూ.75,000 వేతనం చెల్లిస్తారు. ప్రొబేషన్ పూర్తైన తర్వాత పే స్కేల్ ప్రకారం వేతనం లభిస్తుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) ద్వారా జరుగుతుంది. పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి, అనంతరం సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు.
పరీక్షా విధానం
CBT మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు.
కోర్ సబ్జెక్ట్ – 70 మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ – 5 మార్కులు
జనరల్ అవేర్‌నెస్ – 7 మార్కులు
ఇంగ్లీష్ లాంగ్వేజ్ & కాంప్రహెన్షన్ – 5 మార్కులు
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ – 8 మార్కులు
కంప్యూటర్ నాలెడ్జ్ – 5 మార్కులు
నెగెటివ్ మార్కింగ్ ఉండదు.
దరఖాస్తు విధానం
దరఖాస్తులు పూర్తిగా ఆన్‌లైన్ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు.
దరఖాస్తు ఫీజు: అన్ని అర్హత గల అభ్యర్థులు రూ.1,000 దరఖాస్తు ఫీజు చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జూన్ 30, 2026 (ఉదయం 10 గంటల నుంచి)
చివరి తేదీ: జులై 20, 2026 (రాత్రి 11:59 గంటల వరకు)
ఆన్‌లైన్ మాక్ టెస్టులు: ఆగస్టు 15, 2026 నుంచి
CBT పరీక్షలు: ఆగస్టు 22 నుంచి 29, 2026 వరకు
ప్రాథమిక కీ విడుదల: చివరి పరీక్ష జరిగిన రెండు రోజుల తర్వాత
మెరిట్ లిస్ట్: సెప్టెంబర్ చివరి వారంలో
పరీక్షా కేంద్రాలు
ఆంధ్రప్రదేశ్‌లోని పలు నగరాలతో పాటు హైదరాబాద్, ఖమ్మం, బెంగళూరు, చెన్నై, బెర్హంపూర్ నగరాల్లో కూడా పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసి ప్రభుత్వ రంగంలో మంచి వేతనంతో కెరీర్ ప్రారంభించాలనుకునే అభ్యర్థులకు ఈ నియామకాలు మంచి అవకాశంగా చెప్పొచ్చు. అర్హత ఉన్నవారు చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
Also Read:
రూ.10 వేలతోనే అద్భుతమైన ట్రిప్.. ఈ టూరిస్ట్ డెస్టినేషన్స్‌ను మిస్ అవ్వొద్దు
గోడకు మేకు కొట్టే ముందు ఈ వాస్తు నియమాలు తప్పక తెలుసుకోండి