సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:44 AM
ఐఐటీ హైదరాబాద్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది...
ఐఐటీ హైదరాబాద్‌తో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం వివిధ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
బీటెక్ - కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ - కోర్సు కాలవ్యవధి నాలుగేళ్ళు - ఫీజు సెమిస్టర్‌కు రూ.37,000
బీఎస్సీ(ఆనర్స్) - కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్ - నాలుగేళ్ళు - మూడేళ్ళ కోర్సు పూర్తి చేసుకుంటే బీఎస్సీ డిగ్రీ ఇచ్చే వెసులుబాటు కల్పించారు - ఫీజు సెమిస్టర్‌కు రూ.32,000
బీఎస్సీ(ఆనర్స్) - మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ - నాలుగేళ్ళు - ఫీజు సెమిస్టర్‌కు రూ.31,500.
బీఏ(ఆనర్స్) ఇంగ్లీష్, ఎకనామిక్స్ - నాలుగేళ్ళు - ఫీజు సెమిస్టర్‌కు రూ.9,500
మొదటి రెండు కోర్సులకు కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. మూడో కోర్సుకు ఇంటర్‌లో మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్టు. చివరి రెండు కోర్సులకు ఇంటర్ ఉత్తీర్ణులు అర్హులు.
మొదటి కోర్సుకు సీయూఈటీ యూజీలో సాధించిన ర్యాంక్ ఆధారంగా సీట్లు భర్తీ చేస్తారు. రెండో ప్రాధాన్యం కింద జేఈఈ మెయిన్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. ఇంకా మిగిలితే అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు. మిగిలిన కోర్సులకు సీయూఈటీ యూజీలో సాధించిన ర్యాంక్ ఆధారం. ఇంకా మిగిలితే అర్హత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా భర్తీ చేస్తారు.
దరఖాస్తుకు అఖరు తేదీ: ఆగస్టు 3(సమర్థ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో)
కౌన్సెలింగ్: ఆగస్టు 11
వెబ్‌సైట్: Portal:https://ssctucuet.samarth.edu.in/
లా ఎంట్రెన్స్ టెస్టులు
క్లాట్: హైదరాబాద్‌లోని నల్సార్ సహా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ జాతీయ న్యాయ కళాశాలల్లో ప్రవేశానికి ఉద్దేశించిన కామన్ లా అడ్మిషన్ టెస్ట్(క్లాట్)ని డిసెంబర్ 6న నిర్వహించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 3 నుంచి అక్టోబర్ 31 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎఐఎల్‌ఈటీ: ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నిర్వహించే ఆలిండియా లా ఎంట్రెన్స్ టెస్ట్(ఏఐఎల్‌ఈటీ) - 2027ని డిసెంబర్ 13న నిర్వహించాలని నిర్ణయించారు. దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 7 నుంచి ఆరంభం కానుంది.
వెబ్‌సైట్: https://consortiumofnlus.ac.in/ clat-2026/notifications/ Press_Release_ CLAT_2027.pdf,https://nationallawuniversitydelhi.in/
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు