Share News

మ్యాథ్స్‌ భయమంటే నీట్‌ కష్టమే!

ABN , Publish Date - Jul 27 , 2026 | 05:47 AM

మ్యాథ్స్‌ అంటే భయంతోనే ఇంటర్‌లో బయాలజీవైపు వచ్చాం అనే విద్యార్థులే ఎక్కువ. బోర్డు పరీక్షల వరకు ఆ ఎంపికతో పెద్ద ఇబ్బంది ఉండక పోవచ్చు. నీట్‌ వంటి పరీక్షల్లో...

మ్యాథ్స్‌ భయమంటే  నీట్‌ కష్టమే!

మ్యాథ్స్‌ అంటే భయంతోనే ఇంటర్‌లో బయాలజీవైపు వచ్చాం అనే విద్యార్థులే ఎక్కువ. బోర్డు పరీక్షల వరకు ఆ ఎంపికతో పెద్ద ఇబ్బంది ఉండక పోవచ్చు. నీట్‌ వంటి పరీక్షల్లో పోటీపడి మెడిసిన్‌లో చేరేందుకు అవసరమైన ర్యాంకు పొందాలంటే ఆ ధోరణితో నెగ్గుకురావడం చాలా కష్టం. మ్యాథ్స్‌పై అవగాహన లేకుంటే ఫిజిక్స్‌లో పట్టు దాదాపుగా అసాధ్యం. ఫిజికల్‌ కెమిస్ట్రీలోనూ ఇబ్బంది ఉంటుంది. అసలు ఈ చిదంబర రహస్యం ఏమిటో చూద్దాం.

మ్యాథ్స్‌ అంటే భయంతో బైపీసీలో చేరిన విద్యార్థులకు ఇంటర్‌ ఆరంభమైన కొద్ది రోజులకే షాక్‌ ఎదురవుతుంది ఫిజిక్స్‌ క్లాస్‌లో సమీకరణాలు, గ్రాఫ్‌లు, త్రికోణమితి, వెక్టర్లు, లాగరిథమ్స్‌, రేషియోస్‌, ఎక్స్‌పోనెంట్స్‌ ఇబ్బంది పెడతాయి. సరిగ్గా అదే పరిస్థితి ఫిజికల్‌ కెమిస్ట్రీలోనూ ఉంటుంది.

ఫ ఫిజిక్స్‌లో కాన్సెప్ట్‌ అర్థమైనప్పటికీ లెక్కలంటే భయంతో సంబంధిత ప్రాబ్లెమ్స్‌ సాల్వ్‌ చేయలేరు. అలా కలిగిన మానసికపరమైన అవరోధం న్యూనతకు దారితీస్తుంది. నిజానికి ఫిజిక్స్‌లో ఎక్కువ భాగం ప్రశ్నలు మ్యాథమెటికల్‌ అప్లికేషన్స్‌పై ఆధారపడతాయి. ఫిజికల్‌ కెమిస్ట్రీ కూడా లెక్కలతో ముడిపడి ఉంటుంది.

  • ఫిజిక్స్‌లో 70-80 శాతం ప్రశ్నలకు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గణిత దశలు అవసరమవుతాయి. ఫిజికల్‌ కెమిస్ట్రీలో కూడా 60-80 శాతం మ్యాథమెటికల్‌ అప్లికేషన్స్‌ ఉంటాయి. మొత్తమ్మీద నీట్‌ ప్రశ్నత్రంలో మూడో వంతు ప్రశ్నలను సాల్వ్‌ చేసేందుకు లెక్కల్లో సామర్థ్యం కూడా అవసరమవుతుంది.

  • నీట్‌లో లెక్కలతో అనుసంధానమైన పది ప్రశ్నలు సాల్వ్‌చేయకుంటే 40 మార్కులు కోల్పోయినట్లే. ఆ ప్రభావం మొత్తం స్కోర్‌పై పడుతుంది. ఫలితంగా ర్యాంక్‌ తగ్గి మెడికల్‌ సీటు రాకపోవచ్చు.

  • ఒక్కోసారి ఆ 40 మార్కులే ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి బదులు ప్రైవేటు సీటుకు పంపుతుంది.

  • మెడిసిన్‌లో చేరాలనుకునే విద్యార్థులు అసలు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలి. విశ్రాంతిని పక్కన పెట్టాలి. పర్సంటేజెస్‌, రేషియో అండ్‌ ప్రపోర్షన్‌, లీనియర్‌ ఈక్వేషన్స్‌, క్వాడ్రేటిక్‌ ఈక్వేషన్స్‌(బేసిక్స్‌), ఎక్స్‌పోనెంట్స్‌, లాగరిథిమ్స్‌, సైంటిఫిక్‌ నొటేషన్‌, గ్రాఫ్‌ రీడింగ్‌, ట్రిగ్నామెట్రిక్‌ రేషియోష్‌, ఆల్జీబ్రిక్‌ మ్యానిప్యులేషన్స్‌, ఎస్‌ఐ యూనిట్స్‌, యూనిట్‌ కన్వర్షన్‌, సిగ్నిఫికెంట్‌ ఫిగర్స్‌ వంటి అంశాలపై పట్టు సాధిస్తే, ఇంటర్‌లో ఫిజిక్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీ సులువుగా అనిపిస్తాయి.

  • బయాలజీపై పట్టు ఉంటే నీట్‌లో క్వాలిఫై కావచ్చు. అంతే తప్ప అవసరానికి తగ్గ ర్యాంకు రాదు. అదేవిధంగా ఫిజిక్స్‌, ఫిజికల్‌ కెమిస్ట్రీలో సాధించిన మార్కులే సీటును తెస్తాయి.

  • చివరగా ఒక్క విషయం, పదో తరగతి తరవాత గణితాన్ని విడిచిపెట్టిన విద్యార్థి ఫిజిక్స్‌ను కష్టంగా భావిస్తాడు. గణితాన్ని స్నేహితుడిగా మార్చుకున్న విద్యార్థి ఫిజిక్స్‌ను స్కోరింగ్‌ సబ్జెక్టుగా మార్చుకుంటాడు.


  • ఫిజిక్స్‌లో న్యూమరికల్‌ ఆధారిత అఽధ్యాయాలు:- యూనిట్‌ అండ్‌

  • మెజర్‌మెంట్‌, లాస్‌ ఆఫ్‌ మోషన్‌, వర్క్‌ - ఎనర్జీ అండ్‌ పవర్‌, సర్క్యులర్‌ మోషన్‌, గ్రావిటేషన్‌, ఆసిలేషన్‌ అండ్‌ వేవ్స్‌, థెర్మోడైనమిక్స్‌, ఎలకో్ట్రస్టాటిస్టిక్స్‌, కరెంట్‌ ఎలక్ట్రిసిటీ, మేగ్నటిజమ్‌, ఎలక్ర్టోమేగ్నటిజమ్‌ ఇండక్షన్‌, ఆల్టర్నేటింగ్‌ కరెంట్‌, రే ఆప్టిక్స్‌

  • ఫిజిక్స్‌లో థియరీ :- ఎక్స్‌పెరిమెంటల్‌ ఫిజక్స్‌, ఎలకో్ట్రమేగ్నటిక్‌ వేవ్స్‌, డ్యూయల్‌ నేచుర్‌, ఆటమ్స్‌, మోడర్న్‌ ఫిజిక్స్‌లో కొన్ని అంశాలు.

  • కెమిస్ట్రీలో న్యూమరికల్‌:- మోల్‌ కాన్సెప్ట్‌, ఆటమిక్‌ స్ట్రక్చర్‌, స్టేట్స్‌ ఆఫ్‌ మేటర్‌, థెర్మోడైనమిక్స్‌, కెమికల్‌ అండ్‌ ఐయానిక్‌ ఈక్విలిబ్రియమ్‌, రీడాక్స్‌ రియాక్షన్స్‌, సొల్యూషన్స్‌, ఎలకో్ట్రకెమిస్ట్రీ, కెమికల్‌ కైనటిక్స్‌.

  • కెమిస్ట్రీలో థియరీ:- ఆర్గానిక్‌ కెమిస్ట్రీ మొత్తం, పీరియాడిక్‌ టేబుల్‌, కెమికల్‌ బాండింగ్‌, పి-బ్లాక్‌, డి అండ్‌ ఎఫ్‌ బ్లాక్‌, కోర్డినేషన్‌ కాంపౌండ్స్‌, మెటలర్జీ వంటి ఇనార్గానిక్‌ కెమిస్ట్రీ చాప్టర్లు.

డాక్టర్‌ పవన్‌ కుమార్‌ కాసు,

ఎక్స్‌లెన్సియా, హైదారాబాద్‌.

ఇవి కూడా చదవండి:

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం

అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు

Updated Date - Jul 27 , 2026 | 06:38 AM