బ్యాంకుల్లో ఉద్యోగాలు
ABN , Publish Date - Sep 14 , 2026 | 02:19 AM
బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీ కోసం వివిధ బ్యాంకులు నోటిఫికేషన్ జారీ చేశాయి. వివిధ బ్యాంకుల్లో ఉద్యోగాల్లో చేరడానికి రాయాల్సిన ఎగ్జామ్స్, కావాల్సిన అర్హతలు ఏమిటంటే...
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) 35 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు: ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్(జెఎంజీఎస్-14, ఎంఎజీఎస్ 21)
అర్హత: సంబంధిత డిగ్రీకి తోడు ఎల్‌ఐబీఎఫ్ నుంచి ఫోరెక్స్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్ ఉండాలి. డాక్యుమెంటరీ క్రెడిట్ స్పెషలిస్ట్ సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుంది.
ఎంపిక: అర్హతలు ఆధారంగా షార్ట్‌లిస్టింగ్, ఆపై ఇంటర్వ్యూ
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 19
వెల్త్ మేనేజ్‌మెంట్‌లో స్పెషల్ క్యాడర్
ఎస్‌బీఐ - ఒప్పంద ప్రాతిపదికన వెల్త్ మేనేజ్‌మెంట్ సేవలకు సంబంధించి స్పెషలిస్ట్ క్యాడర్ పోస్టులకూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టుల వివరాలు: జోనల్ హెడ్(రిటైల్)-1, రీజినల్ హెడ్-5, రిలేషన్‌షిప్ మేనేజర్ - టీమ్ లీడ్-24, ఇన్వె్‌స్టమెంట్ స్పెషలిస్ట్-9, ఇన్వె్‌స్టమెంట్ ఆఫీసర్-4, వీసీ వెల్త్-91, ఏవీసీ వెల్త్-73
అర్హతలు: డిగ్రీ/ఎంబీఏ/సీఏ/సీఎఫ్‌ఏ ఉత్తీర్ణతకు తోడు ఉద్యోగానుభవం ఉండాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా
ఆఖరు తేదీ: సెప్టెంబర్ 25
వెబ్‌సైట్: https://sbi.bank.in/ web /careers/currentopenings.
బ్యాంక్ ఆఫ్ ఇండియా
బ్యాంక్ ఆఫ్ ఇండియా మెనేజీరియల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: చీఫ్ మేనేజర్-10, సీనియర్ మేనేజర్-49. మేనేజర్-118, ఆఫీసర్-28
విభాగాలు: ఫుల్‌స్టాక్ ఇంజనీరింగ్, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్, సప్లయ్‌చైన్ ట్రేడ్ ఫైనాన్స్, డిజిటల్ బ్యాంకింగ్, ఐటీ ప్రొక్యూర్‌మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, డేటా ఇంజనీరింగ్ తదితరాలు
అర్హత: పోస్టునుబట్టి సంబంధిత డిసిప్లిన్‌లో డిగ్రీ/ ఇంజనీరింగ్/ పీజీ ఉత్తీర్ణత
ఎంపిక: ఆనలైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 25
వెబ్‌సైట్: www.bankofindia.bank.in
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా - వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ క్రెడిట్ విభాగాల్లో పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: వెల్త్ ఎగ్జిక్యూటివ్-1000, క్రెడిట్ అనలిస్ట్-100
అర్హత: వెల్త్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు డిగ్రీకి తోడు అనుభవం ఉండాలి. క్రెడిట్ అనలి్‌స్టకు రెండేళ్ళ పీజీ డిగ్రీ/ డిప్లొమా లేదా ఎంబీఏ(ఫైనాన్స్/ మార్కెటింగ్/ బ్యాంకింగ్) ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ళ అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 24
వెబ్‌సైట్: www.bankofbaroda.bank.in/
ఈ వార్తలు కూడా చదవండి..
రూ.505కే విమానం తరహా ప్రయాణం.. కేరళలో లగ్జరీ బస్సు
బ్రిక్స్ సదస్సు విజయవంతం.. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడి అభినందనలు