జాబ్ కార్నర్ 31-08-2026
ABN , Publish Date - Aug 31 , 2026 | 12:57 AM
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ),ఎన్‌టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్‌ల్లో ఉద్యోగాాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అలాగూ కొచ్చిన్ షిప్‌యార్డ్ 60 షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 260 మేనేజర్, 129 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీఓబీ) 2482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్(ఎల్‌బీఓ) పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఏపీలో 80, తెలంగాణలో 50 పోస్టులు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.
అర్హత: డిగ్రీ ఉత్తీర్ణతకు తోడు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్‌లో ఒక ఏడాది అనుభవం ఉండాలి. స్థానిక భాష చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడంలో ప్రావీణ్యం ఉండాలి.
ఎంపిక: ఆన్‌లైన్ టెస్ట్, సైకోమెట్రిక్ టెస్ట్, భాష నైపుణ్య పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 7
వెబ్‌సైట్: www.bankofbaroda.bank.inఎన్‌టీపీసీ - గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్
ఎన్‌టీపీసీ - గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 147 ఇంజనీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీల వివరాలు: సివిల్-43, ఎలక్ట్రికల్-69, మెకానికల్-9, సేఫ్టీ-7, హ్యూమన్ రిసోర్సెస్-4, ఫైనాన్స్-9, సీఎస్ఆర్-5, రాజభాష-1
అర్హత: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్, పీజీ అర్హతలకు తోడు మూడేళ్ల ఉద్యోగానుభవం కూడా ఉండాలి.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 7 వెబ్‌సైట్: www.ngel.in
కొచ్చిన్ షిప్‌యార్డ్
కొచ్చిన్ షిప్‌యార్డ్ 60 షిప్ డ్రాఫ్ట్స్‌మన్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు: మెకానికల్ 47, ఎలక్ట్రికల్ 13
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా
ఎంపిక: ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా(కాడ్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి డ్రాయింగ్ రూపొందించాలి) ఈ టెస్ట్ కొచ్చిలో జరుగుతుంది.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 4
వెబ్‌సైట్: www.cochinshipyard.in
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) 260 మేనేజర్, 129 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
విభాగాలు: సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఐటీ, ఆర్కిటెక్చర్, లా, ఫైర్ సర్వీస్, ఆపరేషన్స్, కమర్షియల్, కార్పొరేట్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్, కార్పొరేట్ కమ్యూనికేషన్స్, ఆపరేషన్స్ అండ్ సర్వే అండ్ కార్టోగ్రఫీ.
అర్హత: ఎంబీఏ, పీజీడీఎం, సీఎంఏ, సీఏ, బీ.ఆర్కిటెక్చర్, లా డిగ్రీ తదితరాలు
ఎంపిక: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, పీఈటీ, పీఎంటీ తదితరాలు
దరఖాస్తుకు ఆఖరు తేదీ: సెప్టెంబర్ 7 వెబ్‌సైట్: www.aai.aero