Share News

రక్షణ దళాల్లో అవకాశాలు

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:25 AM

ఇండియన్‌ నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌, అగ్నివీర్‌ అప్రెంటి్‌సషిప్‌ ఏఎఫ్‌ క్యాట్‌...

రక్షణ దళాల్లో అవకాశాలు

ఇండియన్‌ నేవీలో క్యాడెట్‌ ఎంట్రీ స్కీమ్‌

ఇండియన్‌ నేవీ 10+2 ఎంట్రీ స్కీమ్‌ కింద టెక్నికల్‌ బ్రాంచుల్లో పర్మినెంట్‌ కమిషన్‌ ఆఫీసర్ల కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నాలుగేళ్ళ బీటెక్‌ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి దీనిని ఉద్దేశించారు.

వివరాలు: మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ - చెరో దానిలో 30 సీట్లు ఉన్నాయి. అలాగే చెరో దానిలో గరిష్ఠంగా నాలుగింటిని మహిళలకు ప్రత్యేకించారు.

అర్హత: మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టులుగా 70 శాతం అగ్రిగేట్‌ మార్కులతో ఇంటర్‌ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. అదేవిధంగా జేఈఈ మెయిన్‌కు హాజరై ఉండాలి.

ఎంపిక: జెఈఈ మెయిన్‌ 2026లో సాధించిన ర్యాంక్‌ ఆధారంగా ఎస్‌ఎ్‌సబీ ఇంటర్వ్యూకి షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపిక జరుపుతారు.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 18

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in

అగ్నివీర్‌ అప్రెంటి్‌సషిప్‌

ఇండియన్‌ నేవీ - అగ్నివీర్‌ అప్రెంటి్‌సషిప్‌ 01/2027, 02/2027 బ్యాచ్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది.

ట్రేడులు: ఎలక్ట్రికల్‌, ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ టెక్నాలజీ, మెకానికల్‌, ఫిట్టర్‌, మెషినిస్ట్‌, టర్నర్‌ తదితరాలు

అర్హత: టెన్త్‌ ఉత్తీర్ణతకు తోడు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్‌ ఉండాలి.

ఎంపిక: రెండు దశల్లో పరీక్షలు, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 29

వెబ్‌సైట్‌: www.joinindiannavy.gov.in


ఏఎఫ్‌ క్యాట్‌

భారత వైమానిక దళం - గ్రూప్‌ ఎ గెజిటెడ్‌ హోదాలో ఫ్లయింగ్‌, గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో కమిషన్డ్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఇందుకు ఉద్దేశించిన ఎయిర్‌ ఫోర్స్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌(ఏఎఫ్‌ క్యాట్‌)ని ఆగస్టు 8న నిర్వహిస్తోంది.

పోస్టులు: ఫ్లయింగ్‌ 35(షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ - పురుషులు 30, మహిళలు 5)

  • గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) - ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ ఎలకా్ట్రనిక్స్‌ 136, మెకానికల్‌ 75

  • గ్రౌండ్‌ డ్యూటీ(నాన్‌ టెక్నికల్‌) - వెపన్‌ సిస్టమ్స్‌: పురుషులు 21, మహిళలు 5, అడ్మినిస్ట్రేషన్‌: పురుషులు 50, మహిళలు 12, లాజిస్టిక్స్‌: పురుషులు 4, మహిళలు 2, అకౌంట్స్‌: పురుషులు 5, మహిళలు 2, ఎడ్యుకేషన్‌: పురుషులు 1, మహిళలు 2, మీటియోరాలజీ: పురుషులు 1, మహిళలు 2.

  • గేట్‌ స్కోర్‌తో గ్రౌండ్‌ డ్యూటీ(టెక్నికల్‌) ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ ఎలకా్ట్రనిక్స్‌ పురుషులు 13, మహిళలు 4, ఏరోనాటికల్‌ ఇంజనీర్‌ మెకానికల్‌ పురుషులు 7, మహిళలు 2.

అర్హత: పోస్టుకు తగిన విధంగా ఇంజనీరింగ్‌ లేదా సంబంధిత డిగ్రీ/ పీజీ ఉండాలి. నిబంధనల మేరకు వయస్సు ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, ఏఎ్‌ఫఎస్‌బీ టెస్ట్‌ చివరగా వైద్యపరీక్షల ఆధారంగా

దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూన్‌ 19

వెబ్‌సైట్‌: https://afcat.edcil.co.in

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 06:25 AM