జాబ్ కార్నర్ 27-07-2026
ABN , Publish Date - Jul 27 , 2026 | 05:41 AM
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఓఎన్‌జీసీ
ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ఓఎన్‌జీసీ
ఇండియన్ ఆర్మీ మహిళలకు ప్రత్యేకించి 68వ షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) కోర్సు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
పోస్టులు: షార్ట్ సర్వీస్ కమిషన్(టెక్) - 29(అవివాహితులై ఉండాలి), విడోస్ ఆఫ్ ఢిఫెన్స్-2(టెక్-1, నాన్ టెక్-1)
అర్హతలు: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్/ఈసీఈ, మెకానికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్/బీఈ ఉత్తీర్ణత. ఆఖరు ఏడాది చదువుతున్న విద్యార్థినులూ అర్హులే. నాన్‌టెక్ పోస్ట్‌కు మాత్రం ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ పాసైతే చాలు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, డిగ్రీలో మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆఖరు తేదీ: ఆగస్టు 6
మరో నోటిఫికేషన్‌లో ఇదే కోర్సుకు 350 పోస్టులను అవివాహితులైన పురుషులకు కేటాయించారు(అర్హతలు, ఎంపిక పై పోస్టులకు మాదిరిగానే ఉంటుంది.) ఆగస్టు 7 లోపు దరఖాస్తు చేసుకోవాలి.
ఇంకో నోటిఫికేషన్‌లో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ కింద ఆరు పోస్టుల భర్తీకి నోటిపికేషన్ విడుదల చేశారు. ఎన్‌సీసీ మహిళలు -5, ఆర్మీ పర్సనల్ బ్యాటిల్ క్యాజువాలిటీస్ కింద ఒక పోస్టు ప్రత్యేకించారు. డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. ఎన్‌సీసీ సి సర్టిఫికెట్ పరీక్షలో బి గ్రేడ్ సాధించి ఉండాలి. ఆసక్తి ఉన్న మహిళలు ఆగస్టు 21లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అగ్నివీర్ వాయు(మ్యుజీషియన్) బ్యాచ్‌కు అవిహితులైన స్త్రీ, పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. న్యూఢిల్లీ, బెంగళూరుల్లో సంబంధిత రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 9 వరకు జరుగుతుంది.
అర్హతలు: టెన్త్ పాసై ఉండాలి. కనీసం ఒక సంగీత వాయిద్యాన్ని వాయించగలగాలి. గుర్తింపు పొందిన సంగీత సంస్థ నుంచి గ్రేడ్/ డిప్లొమా సర్టిఫికెట్ లేదా అనుభవాన్ని ధ్రువీకరిస్తూ పత్రం కలిగి ఉండాలి.
ఎంపిక: డాక్యుమెంట్స్ పరిశీలన, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, ఇంగ్లీష్ రాత పరీక్ష, మ్యూజిక్ ప్రొఫిషియెన్సీ టెస్ట్, వైద్యపరీక్ష ఆధారంగా(ఆఖరు తేదీ తదితరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు)
వెబ్‌సైట్: https://iafrecruitment.edcil.co.in
ఓఎన్‌జీసీ
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్(ఓఎన్‌జీసీ) 52 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టులు: 48 ఇంజనీర్లు - పెట్రోలియం/ అప్లయిడ్ పెట్రోలియం/ కెమికల్/ మెకానికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, 4 జియాలజిస్ట్ - జియాలజీలో పీజీ/ పెట్రోలియం జియాలజీ/ జియోలాజికల్ టెక్నాలజీలో ఎమ్మెస్సీ/ఎంటెక్
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా. ఆఖరు తేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.ongcindia.com
ఇవి కూడా చదవండి:
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా వేళ బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్ కలకలం
అడవిలో తప్పిపోయిన 23 మంది అధికారులు.. చివరకు