జాబ్ కార్నర్ 5-10-2026
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:24 AM
అస్సామ్ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, ఇండియన్ ఆర్మీ...
జాబ్ కార్నర్
అస్సామ్ రైఫిల్స్, సీఆర్‌పీఎఫ్, ఇండియన్ ఆర్మీ
అస్సామ్ రైఫిల్స్ - టెక్నికల్/ ట్రేడ్స్‌మన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అక్టోబర్ 28 నుంచి రిక్రూట్‌మెంట్ ర్యాలీ ఆరంభించాలని నిర్ణయించారు. అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు: వారంట్ ఆఫీసర్, రైఫిల్‌మన్, హవల్దార్(మొత్తం 354 ఖాళీలు)
విభాగాలు: సైఫర్, ఎలక్ట్రికల్ ఫిట్టర్, సిగ్నల్, లైన్‌మన్ ఫీల్డ్, ఆర్మర్, ఇంజనీర్ ఎక్విప్‌మెంట్ మెకానిక్, రికవరీ వెహికల్ మెకానిక్, ఎలక్ట్రీషియన్ మోటార్ వెహికల్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మెటల్‌స్మిత్, ఆప్‌హోల్‌స్టర్, ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీర్, వెహికల్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, మేషన్
అర్హతలు: పోస్టును అనుసరించి టెన్త్/ ఇంటర్‌కు తోడు ఐటీఐ/ డిప్లొమా పాసై ఉండాలి.
ఎంపిక: డాక్యుమెంట్ వెరిఫికేషన్, కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇతర టెస్టుల ఆధారంగా.
వెబ్‌సైట్: www.assamrifles.gov.in/
సీఆర్‌పీఎఫ్
సీఆర్‌పీఎఫ్ - స్పోర్ట్స్ కోటా కింద జనరల్ డ్యూటీ కోసం హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టుల వివరాలు: హెడ్ కానిస్టేబుల్-182(పురుషులు 150, మహిళలు 32), కానిస్టేబుల్-339(మహిళలు 258, మహిళలు 81)
అర్హత: హెడ్ కానిస్టేబుల్ పోస్టుకు ఇంటర్ లేదా తత్సమాన పరీక్షకు తోడు నిర్దేశిత ఆటల్లో - స్థానాలు సాధించి ఉండాలి. కానిస్టేబుల్ పోస్టుకు టెన్త్ పాసవడానికి తోడు కేంద్ర/రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్పోర్ట్స్ ట్రయల్ టెస్ట్, క్రీడా సర్టిఫికెట్లు, వైద్య పరీక్షలు, ఒరిజినల్స్ పరిశీలన తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 12 నుంచి నవంబర్ 11 వరకు
వెబ్‌సైట్: https://rect.crpf.gov.in
ఇండియన్ ఆర్మీ
ఇండియన్ ఆర్మీ - డెహ్రాడూన్‌లోని ఇండియన్ మిలటరీ అకాడమీ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశానికి అవివాహితులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
విభాగాలు: సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్, ఎలకా్ట్రనిక్స్, మెకానికల్ సహా మరికొన్ని ఇంజనీరింగ్ స్ట్రీమ్స్
అర్హత: బీఈ/బీటెక్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: రెండు దశల్లో టెస్టులు, ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 29
వెబ్‌సైట్: www.joinindianarmy.nic.in
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!