Share News

క్లాట్‌

ABN , Publish Date - Sep 14 , 2026 | 12:51 AM

నల్సార్‌ సహా జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయ కళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన క్లాట్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 6న దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకున్నప్పటికీ రాయగలిగేలా ఈ టెస్ట్‌ ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే ఈ టెస్ట్‌లో విజయం సాధించవచ్చన్నది నిపుణుల మాట.

క్లాట్‌
CLAT

నల్సార్‌ సహా జాతీయ స్థాయిలో పేరొందిన న్యాయ కళాశాలల్లో చేరేందుకు ఉద్దేశించిన క్లాట్‌ ఈ ఏడాది డిసెంబర్‌ 6న దేశవ్యాప్తంగా జరుపుతున్నారు. ఇంటర్‌లో ఏ గ్రూపు తీసుకున్నప్పటికీ రాయగలిగేలా ఈ టెస్ట్‌ ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం ప్రిపేరైతే ఈ టెస్ట్‌లో విజయం సాధించవచ్చన్నది నిపుణుల మాట.

యూజీ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఉద్దేశించిన ప్రశ్నపత్రంలో 120 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ప్రతి ప్రశ్నకు సమాధానం కరెక్ట్‌గా గుర్తిస్తే ఒక మార్కు కేటాయిస్తారు. తప్పయితే నాలుగో వంతు మార్కు కట్‌ చేస్తారు.

  • కాన్సెప్ట్‌ సహా విషయం మొత్తాన్ని అర్థం చేసుకునే తీరులో ఉన్న మెటీరియల్‌ను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ప్రిపరేషన్‌ సులువుగా ఉంటుంది. క్లాట్‌ ప్రీవియస్‌ పేపర్లపై దృష్టిపెడితే పరీక్ష తీరు తెలుస్తుంది. యూజీకి ఉద్దేశించిన టెస్ట్‌లో అయిదు టాపిక్స్‌ ఉంటాయి.

  • ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌లో ఒక్కోటి 450 పదాలతో పాసేజ్‌లు ఉంటాయి. ఒక్కో పాసేజ్‌ చదివేందుకు సుమారు అయిదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది. పన్నెండో తరగతి(ఇంటర్‌) స్థాయిలో పాసేజ్‌లు ఉంటాయి. వీటినుంచి అడిగే ప్రశ్నలకు జవాబులు గుర్తించేందుకు భాష నైపుణ్యాలకుతోడు ఇతర సామర్ధ్యాలు ఉండాలి. పాసేజ్‌లోని వాదనలు, వ్యూపాయింట్‌ని అర్థం చేసుకోవాలి. అనుమితులు - ముగింపులను అవగతం చేసుకోవాలి. పాసేజ్‌ సారాంశాన్ని గుర్తించాలి. ముఖ్యమైన పదాలకు అర్థం తెలుసుకోవాలి. అప్పుడు సమాధానాన్ని గుర్తించాలి. వ్యాకరణంపై దృష్టికి తోడు ఇంగ్లీష్‌లో వివిధ అంశాలను చదివే విద్యార్థులకు ఈ విభాగం పెద్ద విషయం కాదు.


  • రెండో టాపిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ సహా కరెంట్‌ అఫైర్స్‌. ఇందులో కూడా రమారమి 450 పదాలతోనే పాసేజ్‌లు ఉంటాయి. న్యూస్‌, వాస్తవాధారిత రచనలు ఆధారంగా ఇవి ఉంటాయి. లీగల్‌ సమాచారం లేదా చర్చించిన విషయంపైనే ప్రశ్నిస్తారు. పాసేజ్‌లో ఉన్న లీగల్‌ విషయాలకు మించిన ప్రశ్నలు మాత్రం అడగరు. ప్రపంచంలో అదేవిధంగా ఇండియాలో జరిగిన సమకాలీన సంఘటనలు, ఆర్ట్స్‌ అండ్‌ కల్చర్‌, ఎప్పటికీ ప్రాముఖ్యం కలిగిన చారిత్రక విషయాలపై ఈ పాసేజ్‌లు ఉంటాయి. హిస్టరీ, రోజువారి సైన్స్‌, పుస్తకాలు, రచయితలు వంటి అంశాలు తెలిసి ఉండాలి.

  • లీగల్‌ రీజనింగ్‌లోనూ పాసేజ్‌లే ఉంటాయి. సిట్యుయేషన్స్‌ లేదంటే లీగల్‌ అంశాలు ఇమిడి ఉన్న దృశ్యాలు, పబ్లిక్‌ పాలసీ ప్రశ్నలు లేదా తత్వశాస్త్రపరిధిలో నైతికపరమైన విచారణలు ఉంటాయి. వీటికి సమాధానం ఇచ్చేందుకు న్యాయపరిజ్ఞానం అవసరం లేదు. జనరల్‌ అవగాహన ఉంటే చాలు. ప్రతి పాసేజ్‌ కింద ప్రశ్నలు ఉంటాయి. ఏవి సెట్‌ అవుతాయో తెలుసుకుని సమాధానం ఇవ్వాలి. విద్యార్థికి ఉండే లేటరల్‌ థింకింగ్‌ను అంచనా వేసే విధంగా ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో మంచి స్కోర్‌ పొందాలంటే మాత్రం నిరంతరంగా ప్రాక్టీస్‌ తప్పనిసరి. ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ టెక్నిక్స్‌ కూడా విద్యార్థికి తెలిసి ఉండాలి.


  • లాజికల్‌ రీజనింగ్‌లోనూ పాసేజ్‌లే ఉంటాయి. ప్రతి పాసేజ్‌ కింద ఒకటి లేదా మరిన్ని ప్రశ్నలు అడుగుతారు. తర్కం ఉపయోగించి వీటికి ఒక ముగింపు ఇవ్వాలి. ప్యాటర్న్‌లను తర్కంతో విశ్లేషించుకోవాలి. తదనంతర పరిణామాలు, ఆధారం లేదా హేతువు, జత అయిన వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని సమాధానాలు గుర్తించాలి. అలాగే కొన్నింటి విషయంలో సంబంధాలను గుర్తించగలిగితే జవాబు తెలుస్తుంది.

  • చివరగా క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌లో పదో తరగతి స్థాయి లెక్కలు తెలిస్తే చాలు. బేసిక్‌ ఆల్జీబ్రా, మెన్సురేషన్‌, స్టాటిస్టికల్‌ ఎస్టిమేషన్‌పై పట్టుతో ఇందులోని అడిగే ప్రాబ్లెమ్స్‌ను సాల్వ్‌ చేయవచ్చు. మేథ్స్‌లోని ప్రాథమిక నైపుణ్యాలను పరీక్షించేలా ఈ విభాగం ఉంటుంది.

జనరల్‌గా

  • ఇంగీష్‌ ఒకాబులరీలో పట్టు సాధించేందుకు షార్ట్‌కట్స్‌ ఏవీ లేవు. ఇంటెన్సివ్‌ రీడింగ్‌ ఒక్కటే ప్రత్యామ్నాయం. ఒకాబులరీ బిల్డింగ్‌ పుస్తకాలు కూడా ఈ విషయంలో ఉపయోగపడతాయి.

  • మార్కెట్‌లో పేరున్న ఆంగ్ల దినపత్రికలు, పుస్తకాలు చదివితే ప్రయోజనాలు ఉంటాయి. ఇంగ్లీష్‌పై పట్టుకుతోడు కరెంట్‌ అఫైర్స్‌కు సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందవచ్చు. వివిధ పదాలపై అదేవిధంగా వాక్యాలపై అవగాహన కలుగుతుంది. న్యాయవాదిగా మున్ముందు కెరీర్‌లోనూ ఈ అనుభవం ఉపయోగపడుతుంది.


  • మధ్య మధ్య విరామం ఇచ్చుకుంటూ రెగ్యులర్‌గా మాక్‌ టెస్టులకు హాజరైతే వేగం పెరుగుతుంది. అంతిమంగా అది పరీక్ష రోజున ఉపకరిస్తుంది.

  • మేథ్స్‌లో ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలో ఉంటాయి. బేసిక్‌ అర్థమెటిక్‌ సామర్థ్యాన్ని పెంచుకుంటే చాలా మంచిది. అది ప్రొఫెషనల్‌ లైఫ్‌కూ ఉపయోగపడుతుంది.

  • లా చదవాలని భావించే విద్యార్థులు రాజ్యాంగం, చట్ట సంబంధ అంశాలపై ఇప్పట్నుంచీ అవగాహన పెంచుకుంటే మంచిది. రాజకీయ, ప్రపంచ పరిణామాలపై ఆసక్తిని బలంగా పెంచుకుంటే లా స్టడీ అలాగే ప్రొఫెషన్‌లో రాణించేందుకు అది బాగా తోడ్పడుతుంది.

  • ఇలాంటి టెస్టులకు, బోర్డు ఎగ్జామ్స్‌ మధ్య తేడా ఉంటుంది. ఇలాంటి కాంపిటేటివ్‌ పరీక్షలు రాసే విద్యార్థులు తరుచూ తమ సామర్థ్యాన్ని విశ్లేషించకోవాలి. తప్పులను సరిదిద్దుకుని స్కోర్‌ పెంచుకునే ప్రయత్నం చేయాలి.

  • అన్నింటి కంటే మించి ఏదైనా సాధించగలమన్న బలమైన సంకల్పం ఉండాలి. అది ఏ పరీక్షకైనా, మరేపనికైనా చాలా అవసరం. క్లాట్‌ సహా ఎక్కడైనా, ఎప్పుడైనా విజయం సాధించేందుకు ఆ సంకల్పబలం బాగా ఉపయోగపడుతుంది.

పీజీ స్థాయి టెస్ట్‌

ప్రశ్నల సంఖ్య. పాసేజ్‌లు, మార్కింగ్‌ యూజీ టెస్ట్‌ మాదిరిగానే ఉంటాయి. అయితే పూర్తిగా లా అండర్‌ గ్రాడ్యుయేట్‌(బీఎల్‌/ ఎల్‌ఎల్‌బీ) కోర్సులో చదివిన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. కానిస్టిట్యూషనల్‌ లా, జురిస్‌ప్రుడెన్స్‌, అడ్మినిస్ట్రేటివ్‌ లా, లా ఆఫ్‌ కాంటాక్ట్‌, టార్ట్స్‌, ఫ్యామిలా లా, క్రిమినల్‌ లా, ప్రాపర్టీ లా, కంపెనీ లా, పబ్లిక్‌ ఇంటర్నేషనల్‌ లా, టాక్స్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, లేబర్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ లా నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఓమన్ తీరంలో భారత నౌకపై దాడి.. 13 మంది భారతీయులు

అంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి: మోదీఅంతర్జాతీయ సంక్షోభాలను సమర్థంగా ఎదుర్కోవాలి

Updated Date - Sep 14 , 2026 | 01:15 AM