పూలు, పండ్ల తోటలపై శాస్త్రీయ అవగాహనకు హార్టికల్చర్
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:58 AM
వ్యవసాయ పరిధిలోనే ఉద్యాన రంగానికి ఎంతో ప్రాధాన్యం నేడు ఉంది. ఈ రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన...
వ్యవసాయ పరిధిలోనే ఉద్యాన రంగానికి ఎంతో ప్రాధాన్యం నేడు ఉంది. ఈ రంగంలోనూ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో శాస్త్రీయ పరిజ్ఞానం కలిగిన నిపుణులు అవసరం అధికమవుతోంది. దీనిలో అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలో కోర్సు బీఎస్సీ ఆనర్స్ (హార్టికల్చర్).
నాలుగేళ్ల బీఎస్సీ(ఆనర్స్) హార్టికల్చర్ డిగ్రీ కోర్సులో ఎనిమిది సెమిస్టర్లు ఉంటాయి. తొలి మూడేళ్ళలో ఫండమెంటల్స్ ఆఫ్ హార్టికల్చర్, ప్రిన్సిపుల్స్ ఆఫ్ లాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ఫండమెంటల్స్ ఆఫ్ ఎంటమాలజి, ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవల్‌పమెంట్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాంట్ బ్రీడింగ్, టెంపరేట్ ఫ్రూట్ క్రాప్స్, కమర్షియల్ ఫ్లోరీ కల్చర్, లైవ్ స్టాక్ మేనేజ్‌మెంట్, ఆర్నమెంటల్ హార్టికల్చర్, మెడిసినల్ అండ్ అరోమేటిక్ క్రాప్స్, ఇన్‌సెక్ట్ పెస్ట్స్ ఆఫ్ ఫ్రూట్స్, ప్లాంటేషన్, మెడిషినల్ అండ్ అరోమేటిక్ క్రాప్స్, వాటర్ మేనేజ్‌మెంట్ ఇన్ హార్టికల్చర్ క్రాప్స్, డ్రై ల్యాండ్ హర్టికల్చర్-ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్, బ్రీడింగ్ ఆఫ్ వెజిటెబుల్, ట్యూబర్, స్పైస్ క్రాప్స్, ఇంట్రడక్టరీ అగ్రో ఫారెస్ర్టీ, హార్టి బిజినెస్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలు బోధిస్తారు. చివరి ఏడాది ఏడో సెమిస్టర్‌లో స్టూడెంట్ రూరల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవేర్‌నెస్ డెవల్‌పమెంట్ యోజనలో గ్రామాలు, పరిశ్రమల సందర్శన, టూర్స్ ఉంటాయి. ఎనిమిదో సెమిస్టర్ యావత్తు ఎడ్యుకేషన్ బై లెర్నింగ్ అండ్ ప్రాక్టీ్‌స-ఈల్‌పి ఉంటుంది.
బీఎస్సీ ఆనర్స్(హార్టికల్చర్) తరవాత ఎమ్మెస్సీ చేయవచ్చు. ఫ్రూట్ సైన్స్, వెజిటెబుల్ సైన్స్, ఫ్లోరీకల్చర్ అండ్ ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్, స్పైసెస్, మెడిషినల్ అండ్ అరోమేటిక్ క్రాప్స్, పోస్ట్‌హార్వెస్టింగ్ టెక్నాలజీ, హార్టికల్చర్ ప్లాంట్ పెథాలజీ, హార్టికల్చర్ ఎంటమాలజీ స్పెషలైజేషన్‌లు ఎమ్మెస్సీలో ఉన్నాయి. ఆపై పీహెచ్‌డీకి అవకాశం కూడా ఉంటుంది.
రాష్ట్రస్థాయిలో హార్టికల్చర్ ఆఫీసర్స్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ పోస్టులకు వీరు అర్హులు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), కృషివిజ్ఞాన్ కేంద్రం(కేవీకే) వంటి సంస్థల్లో పరిశోదన, రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. ఎమ్మెస్సీ, పీహెచ్‌డి చేసిన విద్యార్థులు అసొసియేట్ ప్రొఫెసర్స్,. సైంటి్‌స్టలుగా పనిచేయవచ్చు.
ప్రైవేటు రంగం - సీడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు హైబ్రీడ్ విత్తన అభివృద్దికి నిపుణులుగా వీరిని నియమిస్తాయి. పురుగుమందులు, బయో కంట్రోల్ ఉత్పత్తుల పరిశోధనలో అవకాలు ఉంటాయి. ఫుడ్ ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, ఎగుమతి రంగాలకు తోడు హైడ్రో ఫోనిక్, ఆర్గానిక్ ఫార్మింగ్, అగ్రి స్టార్టప్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి.
బ్యాంకింగ్ రంగాల్లో హార్టికల్చర్ గ్రాడ్యుయేట్‌లకు ప్రత్యేకమైన డిమాండ్ ఉంది. పాలిహౌస్ కల్టివేషన్, తోటల అబివృద్ది రంగంలో సాంకేతికంగా అంచనా వేయడానికి నిపుణులగా నాబార్డ్ సహా వివిధ బ్యాంకులు వీరిని అగ్రికల్చరల్ ఫీల్డ్ ఆఫీసర్స్‌గా తీసుకుంటున్నాయి.
అంతర్జాతీయంగా నెదర్లాండ్, యుఎ్‌సఏ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో గ్రీన్ హౌస్ కల్టివేషన్, ఫ్లొరికల్చర్‌లో మంచి అవకాశాలు లభిస్తున్నాయి. అంతర్జాతీయంగా ఎజ్జీవో ఆర్గనైజేషన్స్ కూడా వీరికి ఆహ్వానం పలుకుతున్నాయి. స్యయం ఉపాధి పథకాలు సరేసరి.
పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్య పంటలు వంటి విభిన్న రంగాల్లో నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశాన్ని ఉద్యాన విద్య అందిస్తుంది.
ఫ సొంతంగా అంటే విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ఆగ్రి-బిజినెస్, తేనెటీగల పెంపకం, ప్రాసెసింగ్ యూనిట్లు, నర్సరీలకు తోడు ఎగుమతి అవకాశాలు కూడా ఉంటాయి. పదిమందికి ఉపాధి కల్పించవచ్చు. తద్వారా విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగానూ ఎదగవచ్చు.

తెలంగాణ
ఫ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా, ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ హార్టికల్చర్‌లో యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. దీని పరిధిలో రాజేంద్రనగర్(హైదరాబాద్)లో 90సీట్లు, మోజర్లలో 80 సీట్లు, మల్యాలలో 30 సీట్లు ఉన్నాయి. మరో 30 సీట్లతో అశ్వారావ్‌పేటలో ఇంకో కాలేజీ ఈ విద్యా సంవత్సరంలో ఆరంభం కానుంది. తెలంగాణ ఈఏపీసెట్‌లో ర్యాంకు ఆధారంగా బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో చేరవచ్చు.
ఫ సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద రాజేంద్రనగర్‌లో 40, మోజెర్లలో 20 సీట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పీజీ ప్రోగ్రామ్‌ల్లో 30, పీహెచ్‌డీ కోసం 10 సీట్లు ఉన్నాయి.
డాక్టర్ ఎన్.శ్రీనివాసన్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్
శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ యూనివర్సిటీ

ఆంధ్రప్రదేశ్
ఏపీలో ఈఏపీసెట్‌లో ర్యాంకు ఆధారంగా బీఎస్సీ హార్టికల్చర్ కోర్సులో చేరవచ్చు. డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో అయిదు ప్రభుత్వ, నాలుగు ప్రైవేటు కళాశాలల్లో బీఎస్సీ హార్టికల్చర్‌లో 560 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో ప్రభుత్వ కళాశాలలు వెంకట్రామన్నగూడెంలో ప్రధాన విశ్వవిద్యాలయ క్యాంపస్ కాగా వైఎస్‌ఆర్ జిల్లా అనంతరాజుపేట, పార్వతీపురం(విజయనగరం), చినలాటరపి(ప్రకాశం), పులివెందులలో ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి. ప్రైవేటు కళాశాలలు తాడిపత్రి(అనంతపురం), మార్కాపురం(ప్రకాశం), సీఎస్‌పురం (ప్రకాశం), అనంతపురంలో ఉన్నాయి.
డాక్టర్ కట్టుపల్లి ధనుంజయరావు, వైస్‌చాన్సలర్
డాక్టర్ వైఎ్‌సఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం
రవికిరణ్ మైలవరపు, తాడేపల్లిగూడెం రూరల్,
తాడెం నర్సింలు, ములుగు మండలం
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News