కెనరా బ్యాంక్, DRDOలో అప్రెంటిస్‌షిప్ ఉద్యోగాలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 05:38 AM
అప్రెంటిస్‌షిప్ కెనరా బ్యాంక్, డీఆర్‌డీఓ
అప్రెంటిస్‌షిప్
కెనరా బ్యాంక్, డీఆర్‌డీఓ
కెనరా బ్యాంక్ 3500 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఏపీలో 247, తెలంగాణలో 134 ఖాళీలు కూడా ఇందులోనే కలిసి ఉన్నాయి.
అర్హత: ఏదైనా డిసిప్లిన్‌లో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: ఇంటర్/ డిప్లొమా లేదా తత్సమాన పరీక్షలో సాధించిన మార్కుల/పర్సంటేజ్ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 17
వెబ్‌సైట్: https://nats.education.gov.in, www.canarabank.bank.in
డీఆర్‌డీఓ
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీఓ) బాలసోర్‌లోని ప్రూఫ్ అండ్ ఎక్స్‌పెరిమెంటల్ ఎస్టాబ్లిష్‌మెంట్ అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్(బీటెక్)-15, టెక్నీషియన్ అప్రెంటిస్(డిప్లొమా)-35. (2022 నుంచి 2026లోపు సదరు డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులు మాత్రమే అర్హులు)
విభాగాలు: ఎలకా్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్, కెమికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్, ఎలక్ట్రికల్, సినిమాటోగ్రఫీ, ఆటోమొబైల్
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: అక్టోబర్ 12
వెబ్‌సైట్: https://nats.education.gov.in, www.drdo.gov.in.
ఈ వార్తలూ చదవండి
పాక్ హనీట్రాప్‌లో భారత నేవీ ఉద్యోగి.. రక్షణ రహస్యాల లీక్ ఆరోపణలపై అరెస్ట్
క్షణాల్లో ఘోరం.. 100 మీటర్ల లోయలో పడ్డ కారు!