ప్రత్యేక విద్యా కోర్సులకు ప్రవేశాలు 2026
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:52 AM
స్పెషల్ ఎడ్యుకేషన్, డీఎస్ఎన్‌ఎల్‌యూలో ఎల్‌ఎల్‌బీ, ముంబై ఐఐఎంలో బీఎస్
స్పెషల్ ఎడ్యుకేషన్
సికిందరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండీక్యా్‌ప్డ(ఎన్‌ఐఈపీఐడీ)కు నవీ ముంబై, నోయిడా, కోల్‌కతాలో రీజినల్ సెంటర్లు; దావణగరె, రాజ్‌నందగావ్, నెల్లూరు(ఎపీ)లో కాంపోజిట్ రీజినల్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ అందిస్తున్న వివిధ కోర్సులకు సంబంధించిన ఉమ్మడి నోటిఫికేషన్ విడుదలైంది.
సికింద్రాబాద్: పీజీ డిప్లొమా ఇన్ ఎర్లీ ఇంట్రవెన్షన్, ఎంఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఈడీ ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్, బీఏ బీఈడీ ఎస్‌ఈ (ఐడి) మిడిల్ స్టేజ్(ఐఎస్‌ఐటిఈపీ); డిప్లొమా కోర్సులు - డిపొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎర్లీ చైల్డ్‌హుడ్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఒకేషనల్ రీహాబిలిటేషన్, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంట్రప్రిటేషన్.
నెల్లూరు: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ స్పెషల్ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ ఇంట్రప్రిటేషన్
మిగిలిన సెంటర్లలో నిర్వహిస్తున్న కోర్సులు, అదేవిధంగా వాటిలో చేరేందుకు అవసరమైన అర్హతల కోసం సంస్థ విడుదల చేసిన ప్రకటన చూడవచ్చు. యూజీ, పీజీ కోర్సులకు జూలై 6, 15 తేదీలను దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. డిప్లొమా కోర్సులను ఆర్‌సీఐకి అనుబంధంగా నిర్వహిస్తున్నారు. అందువల్ల సంబంధిత షెడ్యూల్‌ను ఆర్‌సీఐ విడుదల చేస్తుంది.
వెబ్‌సైట్: www.rehabcouncil.nic.in, www.niepid.nic.in
డీఎస్ఎన్‌ఎల్‌యూలో ఎల్‌ఎల్‌బీ
ఏపీ విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ (డీఎస్ఎన్‌ఎల్‌యూ)లో మూడు సంవత్సరాల కాలవ్యవధి కలిగిన ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. మొత్తం సీట్లు 66 కాగా 33 సీట్లను ఏపీకి ప్రత్యేకించారు. మిగిలిన వాటిలో 27 సీట్లకు దేశంలో ఎవరైనా పోటీపడవచ్చు. ఆరు సీట్లను విదేశీయులు/ నాన్ రెసిడెంట్ ఇండియన్స్/ నాన్‌రెసిడెన్ ఇండియన్స్ స్పాన్స్‌ర్డ్‌కు కేటాయించారు. సీట్ల కేటాయింపులో రిజర్వేషన్లను అమలుపరుస్తారు.
కనీసం 45 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. మార్కుల విషయంలో రిజర్వుడ్ వర్గాలకు నిబంధనల మేరకు మార్కుల సడలింపు ఉంది. ఎంట్రన్స్ టెస్ట్‌లో సాధించిన మార్కుల ఆధారంగా సీట్ల భర్తీ ఉంటుంది. ఈ టెస్ట్ 100 మార్కులకు ఉంటుంది. జనరల్ నాలెడ్జ్, లీగల్ ఆప్టిట్యూడ్, కరెంట్ అఫైర్స్ నుంచి మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు అడుగుతారు. జూన్ 21లోగా దరఖాస్తులను సమర్పించుకోవాలి. ప్రవేశ పరీక్ష జూన్ 28న విశాఖపట్నంలోని యూనివర్సిటీలో ఉంటుంది.
వెబ్‌సైట్: www.dsnlau.ac.in
ముంబై ఐఐఎంలో బీఎస్
ఐఐఎం(ముంబై) బీఎస్ - డిజిటల్ సైన్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. నాలుగేళ్ళ ఈ కోర్సు 8 సెమిస్టర్లుగా ఉంటుంది. ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలు కోర్సులో భాగంగా ఉంటాయి.
ఫ కోర్సులో చేరిన తదుపరి ఒక ఏడాది తరవాత వైదొలిగితే సర్టిఫికెట్ ఇస్తారు. రెండేళ్ళ తరవాత డిప్లొమా, మూడేళ్ళ తదుపరి అడ్వాన్స్‌డ్ డిప్లొమా, నాలుగూళ్ళూ చదివితే బీఎస్ డిగ్రీ ప్రదానం చేస్తారు. మరొక ఏడాది చదివి ఎంబీఏ కూడా పొందవచ్చు.
ఫ కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత, జేఈఈ మెయిన్ స్కోర్‌తో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూతో సీట్లు కేటాయిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: https//iimmumbai.ac.in/admissions
ఈ వార్తలు కూడా చదవండి...
ఫాంహౌస్ కేడీతోనైనా, ఢిల్లీలో మోదీతోనైనా కొట్లాడేందుకు సిద్ధం: సీఎం రేవంత్‌రెడ్డి
ఆ పనుల్లో నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవు.. మంత్రి సీతక్క వార్నింగ్
Read Latest Telangana News, AP News And National News