Share News

ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను లోకేశ్ శుభాకాంక్షలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:35 PM

ఏపీ టెట్(APTET)-జూన్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల విడుదలను ఎక్స్ వేదికగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం ప్రకటించారు.

ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను లోకేశ్ శుభాకాంక్షలు
AP Minister Nara Lokesh

అమరావతి, సెప్టెంబర్13: ఏపీ టెట్(APTET)-జూన్ 2026 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల విడుదలను ఎక్స్ వేదికగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదివారం ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్ aptet.apcfss.in లో అందుబాటులో టెట్ ఫలితాలు ఉంటాయని వివరించారు. 9552300009 వాట్సాప్ నంబర్ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకునే అవకాశం ఉందని స్పష్టం చేశారు. టెట్‌లో 51 శాతం మంది ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.


అలాగే 47 శాతం రెగ్యులర్ అభ్యర్థుల ఉత్తీర్ణత పొందారని చెప్పారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు, ముఖ్యంగా ఇన్-సర్వీస్ టీచర్లకు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. అర్హత సాధించని వారు నిరాశ చెంద వద్దని, విజయం అనేది ఓ ప్రయాణమని వారికి విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్ సూచించారు.

Updated Date - Sep 13 , 2026 | 07:51 PM