ఇన్ సర్వీస్ టీచర్లకు గుడ్ న్యూస్.. స్పెషల్ టెట్ నోటిఫికేషన్ విడుదల
ABN , Publish Date - Aug 24 , 2026 | 06:39 PM
రాష్ట్రంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు 'స్పెషల్ టెట్' నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరిస్తామని వెల్లడించింది.
అమరావతి, ఆగస్టు 24: రాష్ట్రంలో ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు 'స్పెషల్ టెట్' నోటిఫికేషన్‌ను ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేసింది. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ల స్వీకరిస్తామని వెల్లడించింది. ఆధికారిక వెబ్‌సైట్ http://cse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ప్రతి పేపర్‌కు రూ. 1000 అప్లికేషన్ ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. అక్టోబర్ 5వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని వెల్లడించింది.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) రూపంలో స్పెషల్ టెట్ నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. ఉపాధ్యాయుల సర్వీసులో కొనసాగింపుతోపాటు ప్రమోషన్లకు మాత్రమే ఈ టెట్ వర్తిస్తుందని స్పష్టం చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌కు ఈ స్పెషల్ టెట్ వర్తించదని పాఠశాల విద్యాశాఖ పేర్కొంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే వారికి ఏమైనా సందేహాల ఉంటే.. ఈ హెల్ప్‌డెస్క్ నంబర్లు 8121947387, 7995649286, 6281704160 కాల్ చేయాలని పాఠశాల విద్యాశాఖ సూచించింది.