Share News

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ప్రాథమిక కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ABN , Publish Date - May 25 , 2026 | 02:19 PM

ఏపీ ఈఏపీసెట్‌ (AP EAPCET) 2026కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీని APSCHE విడుదల చేసింది. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్సర్ కీతో పాటు తమ రెస్పాన్స్ షీట్‌ను కూడా చెక్ చేసుకోవచ్చు.

ఏపీ ఈఏపీసెట్‌ 2026 ప్రాథమిక కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
AP EAMCET Key Release

ఇంటర్నెట్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌ (AP EAMCET/EAPCET) 2026కు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) విడుదల చేసింది. పరీక్ష రాసిన అభ్యర్థులు ఇప్పుడు అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి తమ సమాధానాలను చెక్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేసి జవాబు కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.


జవాబు కీని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in ను ఓపెన్ చేయాలి.

  • హోమ్‌పేజీలో కనిపించే 'AP EAPCET 2026' లింక్‌పై క్లిక్ చేయాలి.

  • ప్రాథమిక ఆన్సర్ కీలతో కూడిన మాస్టర్ ప్రశ్నపత్రాలు అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

  • పరీక్ష తేదీ, స్ట్రీమ్, షిఫ్ట్‌కు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.

  • రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్ నమోదు చేయాలి.

  • గెట్ కీ డిటేల్స్‌పై క్లిక్ చేస్తే ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్ కనిపిస్తాయి.

  • వాటిని PDF రూపంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు పంపిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత APSCHE తుది ఆన్సర్ కీని ఫలితాల సమయంలో విడుదల చేయనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

రక్తచరిత్ర ఎవరిదో ప్రజలకు తెలుసు.. జగన్ అండ్ కోపై మంత్రి నారాయణ ధ్వజం

కూటమి ప్రభుత్వంలో పేదల ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తున్నాం: మంత్రి అనగాని

Read Latest AP News 

Updated Date - May 25 , 2026 | 02:19 PM