మన దేశంలో చదువుకునే విదేశీయుల్లో అత్యధికులు ఈ దేశం వారేనట..!
ABN , Publish Date - Jul 13 , 2026 | 10:58 AM
ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది.
ఇంటర్‌నెట్ డెస్క్: ఇండియాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో నేపాల్ దేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారని కేంద్ర విద్యాశాఖ నిర్వహించిన ‘AISHE సర్వే’లో తేలింది. 2023-24 అకాడమిక్ ఇయర్‌లో ఎక్కువ మంది విదేశీ విద్యార్థులకు ఆతిథ్యం ఇచ్చిన రాష్ట్రంగా కర్ణాటక ప్రథమ స్థానంలో నిలిచిందని ఆ సర్వే పేర్కొంది. కేంద్ర విద్యాశాఖ తాజాగా విడుదల చేసిన AISHE 2023-24 రిపోర్టు ప్రకారం..
2023-24 అకాడమిక్ ఇయర్‌లో దేశంలోని వివిధ కళాశాలలు 173 దేశాలకు చెందిన విద్యార్థులకు చోటు కల్పించాయి. దేశ వ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీలు, కళాశాలల్లో 58,134 మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు. భారతదేశానికి చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులలో నేపాల్‌కు చెందిన వారు 24.1 శాతం మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో యూఏఈ నుంచి 7 శాతం.. అమెరికా నుంచి 5.9 శాతం.. బంగ్లాదేశ్ నుంచి 5.9 శాతం మంది విద్యార్థులు ఉన్నారు.
అత్యధిక విదేశీ విద్యార్థులు చదువుకోవడానికి ఎంచుకున్న రాష్ట్రంగా కర్ణాటక మొదటి స్థానంలో నిలిచింది. 2023-24 అకాడమిక్ ఇయర్‌లో 7,914 మంది విదేశీ విద్యార్థులు కర్ణాటకలో చదువుకున్నారు. రెండో స్థానంలో పంజాబ్.. మూడో స్థానంలో మహారాష్ట్ర నిలిచాయి. అంతర్జాతీయ విద్యార్థులలో 73.6 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో చేరారు.
ఇవి కూడా చదవండి
వింబుల్డన్‌లో మెరిసిన వైభవ్ సూర్యవంశీ.. వీడియో వైరల్
తల్లి కోసం పరితపించిన డెలివరీ బాయ్.. కస్టమర్ చేసిన సాయం వైరల్