Share News

‘వైకుంఠపురం’తో పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు వైభవం!

ABN , Publish Date - Oct 14 , 2026 | 02:16 AM

పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో సిరులు కురిపించడానికి ఉద్భవించిన చారిత్రక స్వప్నం వైకుంఠపురం బ్యారేజీ. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసిపట్టి .

‘వైకుంఠపురం’తో పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు వైభవం!

పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాల మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో సిరులు కురిపించడానికి ఉద్భవించిన చారిత్రక స్వప్నం వైకుంఠపురం బ్యారేజీ. వృథాగా సముద్రంలో కలిసిపోతున్న కృష్ణా జలాలను ఒడిసిపట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న సమున్నత లక్ష్యంతో 2019లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బ్యారేజీకి అంకురార్పణ చేశారు. 10 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో, ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య 30 టీఎంసీల జలాలను వినియోగించుకునేలా రూపొందించిన ఈ బహుళార్థసాధక ప్రాజెక్టు, అమరావతి రాజధాని ప్రాంతానికి జలహారంగా, మెట్ట ప్రాంత రైతులకు వరప్రదాయినిగా నిలవనున్నది. 1998 నుంచి 2026 వరకు ఏటా సగటున 483 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో వృథాగా కలిసిపోయాయి. ఈ బ్యారేజీ నిర్మాణం జరిగితే వృథాకు శాశ్వత అడ్డుకట్టపడుతుంది. ప్రస్తుత ప్రకాశం బ్యారేజీ కృష్ణా డెల్టా వ్యవసాయానికి దశాబ్దాలుగా అండగా నిలుస్తోంది. అదే జల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వైకుంఠపురం బ్యారేజీ మరో అధ్యాయం కానున్నది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ముఖ్యమైన నదీ వ్యవస్థల్లో మున్నేరు నది ఒకటి. భారీ వర్షాలు కురిసినప్పుడు మున్నేరు, దాని ఉపనదులు, వాగుల ద్వారా లక్షలాది క్యూసెక్కుల వరద నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలిసి వృథాగా పోతుంటుంది. వరదను వనరుగా మార్చడమే సమర్థవంతమైన జల నిర్వహణ. ఈ నేపథ్యంలోనే వైకుంఠపురం వద్ద బ్యారేజీ నిర్మాణ ఆలోచన రూపుదిద్దుకుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో పెరుగుతున్న పట్టణీకరణ, తాగునీటి అవసరాలు, భవిష్యత్ రాజధాని ప్రాంత అవసరాలను దృష్టిలో పెట్టుకున్నప్పుడు అదనపు నీటి నిల్వ సామర్థ్యం అవసరం. కృష్ణా బేసిన్ పరిధిలోని నందిగామ, జగ్గయ్యపేట, మైలవరం, పెదకూరపాడు నియోజకవర్గాలు నేడు తీవ్ర నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ బ్యారేజీ నిర్మాణం ద్వారా జగ్గయ్యపేట, నందిగామ ప్రాంతాల మధ్య నీటి లభ్యతను సుస్థిరం చేయవచ్చు. దీంతో పులిచింతల టైల్‌పాండ్‌ వరకు 62 కిలోమీటర్ల పొడవైన అద్భుతమైన జలాశయం ఏర్పడుతుంది. దీంతో రాజధాని అమరావతి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు 3, 4 డిగ్రీల మేర తగ్గుతాయి.

నీరుకొండ ప్రసాద్

ఇవి కూడా చదవండి..

ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా స్వాతి రెడ్డి నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 02:16 AM