Share News

అన్నమయ్య సంకీర్తనలపై జాతీయ సదస్సు

ABN , Publish Date - Aug 26 , 2026 | 02:19 AM

తిరుపతి జిల్లాలోని పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం, అన్నమాచార్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో..

అన్నమయ్య సంకీర్తనలపై జాతీయ సదస్సు

తిరుపతి జిల్లాలోని పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు విభాగం, అన్నమాచార్య ప్రాజెక్టు, తిరుమల తిరుపతి దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో ‘అన్నమా చార్య సంకీర్తనలు శ్రీ వేంకటేశ్వర వైభవము’ అనే అంశంపై ఆగస్టు 27, 28 తేదీలలో రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహిస్తున్నారు. పాకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగే ఈ సదస్సుకు కళాశాల ప్రధానాచార్యులు డాక్టర్ డి.సుజాత అధ్యక్షత వహిస్తారు. చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి వెంకట మణిప్రసాద్‌ (నాని) ముఖ్య అతిథి, పి.వి.కె.ఎన్‌. కళాశాల, చిత్తూరు విశ్రాంత ఆచార్యులు వల్లేరు హరినాయుడు విశిష్ట అతిథి. అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి డాక్టర్ మేడసాని మోహన్ కీలకోపన్యాసం చేస్తారు.

డాక్టర్ కె.ఈశ్వరబాబు

సదస్సు సంచాలకులు

ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్

చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్

For More TG News And Telugu News

Updated Date - Aug 26 , 2026 | 02:19 AM