Vividha: ఈ వారం వివిధ కార్యక్రమాలు 19 01 2026
ABN , Publish Date - Jan 19 , 2026 | 12:06 AM
గంటేడ కథలపై ప్రసంగం, వేమన సాహితీ పురస్కారం, రాణీ పులోమజాదేవి కథా పురస్కారం...
గంటేడ కథలపై ప్రసంగం
రాజాం రచయితల వేదిక 132వ సమావేశం జనవరి 25 ఉ.10గంటలకు విజయనగరం జిల్లా, రాజాంలో విద్యానికేతన్ పాఠశాలలో జరుగుతుంది. అధ్యక్షత శాసపు సత్యనారాయణ. సమావేశంలో ‘గంటేడ కథల్లో మానవ విలువలు’ అం శంపై మూడడ్ల శ్రీనివాసరావు ప్రసంగిస్తారు. వివరాలకు: 98857 58123
గార రంగనాథం
వేమన సాహితీ పురస్కారం
వేమన విజ్ఞాన కేంద్రం, తిరుపతి ఇచ్చే ‘వేమన సాహితీ పురస్కారం–2025’ను తెలకపల్లి రవి స్వీకరిస్తారు. వేమన జయంతి ఉత్సవాల్లో భాగంగా జనవరి 19న వేమన విజ్ఞానకేంద్రంలో జరిగే పురస్కార ప్రదానంలో రూ.10 వేల నగదు పురస్కారంతో సత్కారం ఉంటుం ది. వివరాలకు: 939 8000686.
మల్లారపు నాగార్జున
రాణీ పులోమజాదేవి కథా పురస్కారం
రాణీ పులోమజాదేవి జ్ఞాపకార్థం నగదు పురస్కారం అందజేయాలని వారి కుటుంబం సంకల్పించింది. విజేతకు జూలైలో హైదరాబాద్‌లో జరిగే తెలుగు సాహితీవనం వార్షికోత్సవంలో రూ.5వేల నగదుతో పురస్కారం ఉంటుంది. విజేతలు తప్పనిసరిగా సభకు వచ్చి అవార్డు స్వీకరించాలి. పురస్కారం కోసం కథకులు 2024, 2025 సంవత్సరాల్లో ప్రచురించిన కథా సంపుటాలు రెండు కాపీలను ఫిబ్రవరి 10 లోపు చిరునామా: తిక్కా సత్యమూర్తి, ప్లాట్ నెం–డి42, ఫ్లాట్ నెం–504, సాయి లక్ష్మీ ఎన్‌క్లేవ్, మధురానగర్, హైదరాబాద్ – 500038, ఫోన్: 98493 44109కు పంపాలి.
తెలుగు సాహితీ వనం
ఈ వార్తలు కూడా చదవండి..
అభివృద్ధిని అడ్డుకుంటున్న బీఆర్ఎస్‌ను బొందపెట్టాలి.. సీఎం స్ట్రాంగ్ వార్నింగ్
మేడారంలో కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ
For More TG News And Telugu News