ఈ వారం వివిధ కార్యక్రమాలు 21-09-2026
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:50 AM
పూటకుళ్ళవ్వ’ నవల, సాహిత్య స్వర్ణోత్సవం, జాషువా కవితా పురస్కారం, పిల్లల కోసం బొమ్మల కథల పుస్తకాల పోటీ, ‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం...
‘పూటకుళ్ళవ్వ’ నవల
దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్ ప్రచురించిన మాదారపు వాణిశ్రీ రచన ‘పూటకూళ్ళవ్వ’ నవల ఆవిష్కరణ సెప్టెంబరు 22 మ.2గంటలకు ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్, హిమాయత్ నగర్, హైదరాబాద్‌లో జరుగుతుంది. కె. ఆనందచారి, ఎస్. రఘు, ఎం. వేదకుమార్, కొండపల్లి నిహారిణి, ఇడికోజు శ్రీనివాసా చారి తదితరులు పాల్గొంటారు.
ఎం. వేదకుమార్
‘తెలంగాణ తెలుగు తేజం’ పురస్కారం
సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్ఠాత్మక ‘బుర్ర నర్సమ్మ-లింగారెడ్డి స్మారక’ పురస్కార ప్రదానోత్సవం సెప్టెంబరు 22 సా.5గం టలకు కరీంనగర్ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. ముఖ్య అతిథి జి.వి. శ్యాం ప్రసాద్ లాల్, సభా ప్రారంభకులు జానకి రెడ్డి.
దాస్యం సేనాధిపతి
సాహిత్య స్వర్ణోత్సవం
తెలంగాణ సాహిత్య అకాడమి సౌజన్యంతో తెలుగుశాఖ ఆధ్వర్యంలో నాగార్జున ప్రభుత్వ కళాశాల, నల్లగొండలో అనుమాండ్ల భూమయ్య సాహిత్య స్వర్ణోత్సవం (1976–2026) సెప్టెంబర్ 26న జరుగుతుంది. సభలో సముద్రాల ఉపేందర్, దేశపతి శ్రీనివాస్, ఏనుగు నరసింహారెడ్డ్డి, నామోజు బాలాచారి, సంగనభట్ల నర్సయ్య, గండ్ర లక్ష్మణ రావు, కోయి కోటేశ్వరరావు, బూర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొంటారు. వివరాలకు: 9866977741.
వెల్దండి శ్రీధర్
జాషువా కవితా పురస్కారం
జాషువా 131వ జయంతి సందర్భంగా జాషువా విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం, ప్రజా నాట్య మండలుల ఆధ్వర్యంలో ‘జాషువా కవితా పురస్కారం – 2026’ను కోయి కోటేశ్వరరావుకు ప్రదానం చేస్తారు. సెప్టెంబర్ 27 సా.4 గంటలకు గుంటూరు బ్రాడీపేటలోని గుర్రం జాషువా విజ్ఞాన కేంద్రంలో ఈ సభ జరుగుతుంది. భూసురపల్లి వెంకటేశ్వర్లు, కె.ఎస్.లక్ష్మణరావు, వి. రాం భూపాల్ తదితరులు పాల్గొంటారు.
పాశం రామారావు
పిల్లల కోసం బొమ్మల కథల పుస్తకాల పోటీ
తానా–మంచి పుస్తకం ఆధ్వర్యంలో పదేళ్లలోపు పిల్లల కోసం బొమ్మల పుస్తకాల పోటీకి పుస్తకం (౧/4 క్రౌన్ సైజు, 18x24 సెం.మీ.) ఇన్నర్ టైటిల్, ఇంప్రింట్‌తో సహా 24 పేజీలు ఉండాలి. పేజీలో 10–12 వాక్యాలకు మించి ఉండకూడదు. పిల్లల్లో పుస్తకాలు చదివే అలవాటు పెంచేలా ఉండాలి. కథ, బొమ్మలు ఫిబ్రవరి 28, 2027లోపు చిరు నామా: మంచిపుస్తకం, 12–13–439, వీధి నెం.1, తార్నాక, సికింద్రాబాదు–500017, ఈమెయిల్: tanamp2027picturestory@gmail. com. మరిన్ని వివరాలకు: 99638 62926.
కె. సురేష్
ఈ వార్తలు కూడా చదవండి..
క్యాన్సర్ చికిత్సలో మరో ముందడుగు.. జీజీహెచ్‌లో ఉచిత జన్యు పరీక్షలు
ప్రజల భూమిని లాక్కునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: మంత్రి పొంగులేటి
Read Latest AP News And Telugu News