Share News

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16-11-2026

ABN , Publish Date - Nov 16 , 2026 | 05:22 AM

సినీ కవుల సింగిడి, సింహాచల క్షేత్రంపై పుస్తకాలు, ‘గోరపిట్ట’ కథా సంపుటిపై ప్రసంగం, అంబటి వెంకన్న సాహిత్య సదస్సు, ఖమ్మం ఈస్తటిక్స్ పోటీ ఫలితాలు, విమలా పురస్కారాలు...

ఈ వారం వివిధ కార్యక్రమాలు 16-11-2026

సినీ కవుల సింగిడి

తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురించిన తిరునగరి శరత్‌ చంద్ర రచన ‘తెలంగాణ సినీకవుల సింగిడి’ పుస్తకావిష్కరణ నవంబరు 16. సా.5గంటలకు తెలంగాణ సారస్వత పరిషత్తులో జరుగుతుంది. అధ్యక్షత నామోజు బాలాచారి, ముఖ్య అతిథి సుద్దాల అశోక్‌ తేజ. అతిథులు జె.కె. భారవి, వారాల ఆనంద్‌, మౌనశ్రీ మల్లిక్‌. వివరాలకు 90631 31999.

తెలంగాణ సాహిత్య అకాడమి

సింహాచల క్షేత్రంపై పుస్తకాలు

విశాఖ రచయితల సంఘం ఆధ్వర్యంలో చప్ప గాంధీ ‘శ్రీసింహాద్రి శతకం’, ‘శ్రీసింహాచల క్షేత్రం’ పుస్తకాల ఆవిష్కరణ నవంబరు 19 సా.5.45ని.లకు పౌరగ్రంథాలయం, ద్వారకానగర్‌, విశాఖపట్నంలో జరుగుతుంది. సభలో సుసర్ల సర్వేశ్వర శాస్త్రి, అడపా రామకృష్ణ, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, అద్దంకి శ్రీనివాస్‌, టి.పి. రాజగోపాల్‌ తదితరులు పాల్గొంటారు.

విశాఖ రచయితల సంఘం

‘గోరపిట్ట’ కథా సంపుటిపై ప్రసంగం

రాజాం రచయితల వేదిక 142వ సమావేశంలో భాగంగా సువర్ణముఖి కథా సంపుటి ‘గోరపిట్ట’పై సమతం మహేశ్వరరావు ప్రసంగ సభ నవంబర్ 22 ఉ.10గం.లకు విజయనగరం జిల్లా, రాజాంలో విద్యానికేతన్ పాఠశాలలో జరుగుతుంది. అధ్యక్షత పొదిలాపు శ్రీనివాస్. వివరాలకు: 98857 58123.

గార రంగనాథం

అంబటి వెంకన్న సాహిత్య సదస్సు

తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ‘ఉనికి’, ‘జాబిలి’ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో అంబటి వెంకన్న సాహిత్య సమాలోచన సదస్సు, ‘అంబటి@30’ పుస్తకం ఆవిష్కరణ నవంబరు 22 ఉ.10 గంటల నుంచి రవీంద్ర భారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. సభలో బి. నర్సింగరావు, గోరటి వెంకన్న, విమలక్క, అంబటి సురేంద్రరాజు, సుంకిరెడ్డి నారాయణరెడ్డి తదితరులు పాల్గొంటారు.

ఉనికి


ఖమ్మం ఈస్తటిక్స్ పోటీ ఫలితాలు

ఖమ్మం ఈస్తటిక్స్ 2026 పోటీలో కవిత్వ విభాగంలో రూ.40వేల బహుమతికి దొండపాటి నాగజ్యోతి శేఖర్ ‘చిగురించే పేజీలు’, రూ.10వేల ప్రశంసా పురస్కారాలకు ప్రసాదమూర్తి ‘కొల్లేరు కలలు’, సుంకర గోపాలయ్య ‘నీటికుండలాంటి మనిషి’ సంపుటాలు ఎంపికయ్యాయి. రూ.5 వేల ప్రోత్సాహక బహుమతులకు జాబేర్‌ పాషా, కంచరాన భుజంగరావు, తుల శ్రీనివాస్‌, కుంజా కళ్యాణిల సంపుటాలు ఎంపికయ్యాయి. ఉత్తమ కథగా రూ.25వేల బహుమతికి వంకిరెడ్డి రెడ్డెప్ప రెడ్డి ‘అంపశయ్యపై రైతు’, ద్వితీయ ఉత్తమ కథగా రూ.15వేల బహుమతికి బి. నాగశేషు ‘సాసూలు’, తృతీయ ఉత్తమ కథగా రూ.10వేల బహుమతికి దాసరి చంద్రయ్య ‘ఇరుకు గది’ ఎంపికయ్యాయి. త్వరలో ఖమ్మంలో జరిగే అవార్డుల ప్రదాన కార్యక్రమంలో విజేతలకు నగదు బహుమతితో పాటు షీల్డ్ ఇస్తారు.

రవి మారుత్

విమలా పురస్కారాలు

విమలా స్మారక కథా పురస్కారం 2026కు మారుతి పౌరోహితం ‘ఇల్లిడి సిన తొమ్మిది కథలు’, స్వర్ణ కిలారి ‘గోడవతల’ కథా సంపుటాలు ఎంపికయ్యాయి. విమలా శాంతి ప్రత్యేక కథా పురస్కారానికి సురేష్‌ పిళ్ళై, కెంగార మోహన్‌, శ్రీఊహ ల కథా సంపుటాలు ఎంపికయ్యాయి. నవంబరు చివరి వారంలో పురస్కార ప్రదానం ఉంటుంది.

శాంతినారాయణ

ఈ వార్తలూ చదవండి

చరిత్ర సృష్టించిన స్పేస్‌ఎక్స్.. గాల్లోనే స్టార్‌షిప్‌ను పట్టుకున్న స్టార్‌బేస్..

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ కీలక కమాండర్ హతం

Updated Date - Nov 16 , 2026 | 05:30 AM