Share News

Rohith Vemula Anniversary: ‘రోహిత్‌’ అమరత్వానికి పదేళ్లు

ABN , Publish Date - Jan 17 , 2026 | 05:22 AM

దళిత పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో వ్యవస్థీకృత హత్యకు గురై నేటికి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న...

Rohith Vemula Anniversary: ‘రోహిత్‌’ అమరత్వానికి పదేళ్లు

దళిత పరిశోధక విద్యార్థి రోహిత్‌ వేముల హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్శిటీలో వ్యవస్థీకృత హత్యకు గురై నేటికి పది సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం షోయబ్‌ హాల్‌లో ఒక రోజు సెమినార్‌ జరుగనున్నది. ఉదయం పది గంటల నుంచి నాలుగు సెషన్లుగా ఈ సెమినార్‌ జరుగుతుంది. ‘విశ్వవిద్యాలయం భావన–నయా ఉదారవాద కాలంలో ప్రజలు న్యాయం’ అంశంపై ప్రొఫెసర్‌ కె.శ్రీనివాసులు; ‘ఉన్నత విద్యా సంస్థల్లో విద్యార్థులపై కుల అణచివేత, హింసలు–రోహిత్‌ చట్టం ఆవశ్యకత’ అంశంపై వి.రఘునాథ్‌, అప్నసింగ్‌, మృదుల, డాక్టర్‌ ప్రశాంత్‌ దొంత; ‘కులం, రాజ్యం–విశ్వవిద్యాలయాల్లో విద్యార్థి ఉద్యమాలు’ అంశంపై ప్రొఫెసర్‌ కె.లక్ష్మీనారాయణ; ‘రోహిత్‌ వేముల మరణం ముందు తర్వాత పరిణామాలు–విద్యార్థులు, విద్యార్థి ఉద్యమాలు’ అంశంపై ప్రొఫెసర్లు కె.వై.రత్నం, జి.విజయ్‌, డా. వేల్పుల సుంకన్న, డా. చెముడగుంట శేషయ్య ప్రసంగిస్తారు. బండారి లక్ష్మయ్య అధ్యక్షత వహిస్తారు.

కుల అసమానతల నిర్మూలన పోరాట సమితి

ఇవి కూడా చదవండి...

రైతు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి తుమ్మల

కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 17 , 2026 | 05:22 AM