కాగితం కాదు... కెమెరా మాట్లాడాలి!
ABN , Publish Date - Jul 23 , 2026 | 01:26 AM
ఉత్తరప్రదేశ్‌లోని ‘షాజహాన్‌పూర్’లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ‘I did go of my own will’ అనే వాక్యంలో ‘Not’ అనే పదం చేర్చడం వల్ల ఒక అమాయక యువకుడు జైలు పాలయ్యాడు. ఇది వ్యక్తిగత తప్పు కాదు. ...
ఉత్తరప్రదేశ్‌లోని ‘షాజహాన్‌పూర్’లో జరిగిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ‘I did go of my own will’ అనే వాక్యంలో ‘Not’ అనే పదం చేర్చడం వల్ల ఒక అమాయక యువకుడు జైలు పాలయ్యాడు. ఇది వ్యక్తిగత తప్పు కాదు. ఇది వ్యవస్థలోని పెద్ద లోపం. నేటికీ చాలా పోలీస్ స్టేషన్లలో ఎఫ్ఐఆర్‌లు చేతితో రాస్తున్నారు. సాక్షుల వాంగ్మూలాలు కాగితంపై ఉంటున్నాయి. ఇక్కడే అక్షర దోషాలు, కావాలని చేసే మార్పులు చోటుచేసుకుంటున్నాయి. బీఎన్ఎస్ సెక్షన్ 218 ప్రకారం అధికారి తప్పుడు రికార్డు సృష్టిస్తే 3 సంవత్సరాల జైలుశిక్ష ఉంది. కానీ రుజువు చేయడం కష్టం.
మానవ తప్పిదం వల్ల ఒత్తిడిలో, అలసటలో చిన్న పదం మిస్ అవుతుంది, లేదా ప్రభావితుల ఒత్తిడితో ఎఫ్ఐఆర్‌లో మార్పులు జరగవచ్చు. కానీ రుజువు లేకపోవడం, ఏమి మాట్లాడారు, ఏమి రాశారు అనడానికి సాక్ష్యం లేదు. దీనికి పరిష్కారం- 4 అంచెల సంస్కరణ.
1) డిజిటల్ ఎఫ్ఐఆర్ ద్వారా ఫిర్యాదు ఇచ్చిన వెంటనే ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేయాలి. ఒకసారి సబ్మిట్ అయ్యాక సవరణకు అవకాశం లేకుండా దానిని లాక్ చేయాలి. 2) విచారణ, అరెస్ట్, వాంగ్మూలం ప్రతిదీ బాడీ క్యామ్, సీసీ టీవీ ద్వారా రికార్డ్ అవ్వాలి. న్యాయస్థానంలో ఇదే ప్రధాన సాక్ష్యం కావాలి. 3) సాక్షి మాటలను వీడియో తీసి, ట్రాన్స్‌క్రిప్ట్‌తో జత చేయాలి. అప్పుడు ‘Not’ చేర్చే అవకాశం ఉండదు. 4) సెక్షన్ 218 దుర్వినియోగం చేసిన అధికారిపై వెంటనే సస్పెన్షన్, క్రిమినల్ కేసు నమోదు చేయాలి. ప్రపంచ న్యాయ ప్రాజెక్ట్ ప్రకారం భారత్ స్కోరు 0.46. దీనికి పారదర్శకత లేకపోవడమే ప్రధాన కారణం. తెలంగాణలో ప్రభుత్వం ఇప్పటికే కొన్ని స్టేషన్లలో బాడీక్యామ్‌లు ప్రారంభించింది. దీనిని రాష్ట్రంతో పాటు, దేశమంతటా విస్తరించాలి. ‘అక్షరం ఆయుధమైతే’ డిజిటల్ సాక్ష్యం కవచం అవ్వాలి. కాగితంపై పెన్ కంటే, కెమెరా లెన్స్ న్యాయానికి ఎక్కువ నమ్మకం ఇస్తుంది. చట్టం ముందు అందరూ సమానులే అనే మాటను నిజం చేయాలంటే, ముందు వ్యవస్థను పారదర్శకం చేయాలి.
ఉక్కల్కర్ రాజేందర్‌నాథ్
ఈ వార్తలు కూడా చదవండి..
ఘనంగా గాడిదలకు పెళ్లి ?.. వీడియో వైరల్
లాఠీఛార్జ్‌లో తీవ్రంగా గాయపడిన యువకుడు.. అంతలో తల్లి నుంచి ఫోన్.. వీడియో వైరల్
For More TG News And Telugu News