Share News

Sankranti Splendour: సంక్రాంతి శోభ

ABN , Publish Date - Jan 14 , 2026 | 12:40 AM

మన్ను మిన్నుల కలయిక శ్రమ సౌందర్యానికి రైతే ఏలిక ప్రకృతి శోభకు పల్లెలే వేదిక పాడి పంటలు పొంగే వేడుక...

Sankranti Splendour: సంక్రాంతి శోభ

మన్ను మిన్నుల కలయిక

శ్రమ సౌందర్యానికి రైతే ఏలిక

ప్రకృతి శోభకు పల్లెలే వేదిక

పాడి పంటలు పొంగే వేడుక!

భగ భగల భోగి మంటల్లో

చెడునంతటికి వేద్దాం పాతర

భోగ భాగ్యాలతో చేద్దాం జాతర

దివ్య భవ్యలతో శోభిల్లు భోగి!

ముంగిళ్ళందు రంగవల్లులు

గోమయపు గొబ్బెమ్మలతో

శోభాయమానమై కొలువుదీరే

నవ్య కాంతులతో వెలుగులూరే

శ్రీమహాలక్ష్మి సిరుల సంక్రాంతి!

శ్రీశైల శిఖరమెత్తు ధాన్యపు

రాశులను జూసి

పల్లె నిండా ఆనందాలు పొరలే

ఆరుగాలం శ్రమ ఫలమే రైతు

లోగిళ్ళకు సిరుల పంట తరలే!

పశు పక్ష్యాదులను పూజించి

ఫల పుష్పాలతో హారతులద్ది

పొలి చెలకల్లో పొంగల్లు జల్లి

సిరులిచ్చు భూతల్లికి ప్రణమిల్లి

కాచు మమ్మేలు కనుమ గౌరి!!

– బోనగిరి పాండురంగ

ఈ వార్తలు కూడా చదవండి..

రైలు పట్టాలపైనే మహిళ ప్రసవం.. ఏమైందంటే?

బెట్టింగ్ యాప్‌ బారిన పడి యువకుడి బలి

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 14 , 2026 | 12:40 AM