Share News

ఆ మహిళలకే ఆలయ ప్రవేశం నిషిద్ధం!

ABN , Publish Date - Apr 21 , 2026 | 03:17 AM

ఇటీవల మీడియాతో సహా ఇతర మాధ్యమాల్లో శబరిమలలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం అనే రాస్తున్నారు, చెబుతున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరమే. ఋతుక్రమం ఇంకా మొదలవ్వని...

ఆ మహిళలకే ఆలయ ప్రవేశం నిషిద్ధం!

ఇటీవల మీడియాతో సహా ఇతర మాధ్యమాల్లో శబరిమలలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం అనే రాస్తున్నారు, చెబుతున్నారు. ఇది తీవ్ర అభ్యంతరకరమే. ఋతుక్రమం ఇంకా మొదలవ్వని, ఋతుక్రమం ఆగిపోయిన మహిళా భక్తులకు ఆలయంలోకి అనుమతి ఉంది. వీళ్ల దృష్టిలో వారు మహిళలు కారా?!

దేవుడు అంటేనే నమ్మకం. భక్తితో దేవుని స్వరూపాన్ని పూజించే దేవాలయం కూడా నమ్మకమే. కానీ– నమ్మకాలకూ, మూఢ నమ్మకాలకూ గల తేడా గమనించాలి. సమాజానికి, ఇతరులకు హాని కలిగించని హిందువుల ఆచార వ్యవహారాల్ని గౌరవించాల్సిందే కదా! సాధారణంగా హిందువుల్లో ఋతుక్రమంలో ఉన్న మహిళలు వైదిక క్రతువులకు, దేవాలయాలకు దూరంగా ఉంటారు. ఆ మహిళలు మండల దీక్షలు చేయలేరు. ఇక ఆలయ స్థల పురాణం ప్రకారం.. ఋతుక్రమం ఉన్న మహిళలకు మాత్రమే ఆలయంలోకి ప్రవేశం లేదు. కనుక, ఈ సంప్రదాయంలో మూఢనమ్మకం అనేదానికి తావులేదు. వివక్ష అనే పిలిచే పరిస్థితే లేదు. కాబట్టి మీడియా సంస్థలు తమ అత్యుత్సాహాన్ని నియంత్రించుకుని, ‘శబరిమల ఆలయంలోకి ఋతుక్రమ మహిళల ప్రవేశం నిషిద్ధం’ అనే చదవాలి, రాయాలి.

వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ

ఈ వార్తలు కూడా చదవండి...

గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఏం చర్చించారంటే..

కేసీఆర్ హయాంలో రూ.8 లక్షల కోట్ల అప్పులు చేశారు: మంత్రి వివేక్

33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలి: కిరణ్ కుమార్ రెడ్డి

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 21 , 2026 | 03:17 AM