Pasupuleti Brahmayya: సామాజిక సేవాతత్పరుడు
ABN , Publish Date - Jan 13 , 2026 | 02:07 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పసుపులేటి బ్రహ్మయ్య జీవితం స్ఫూర్తిదాయకమైనది. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పసుపులేటి బ్రహ్మయ్య జీవితం స్ఫూర్తిదాయకమైనది. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలం, పొత్తపి గ్రామంలో జనవరి 13, 1956న జన్మించిన బ్రహ్మయ్య, గ్రాడ్యుయేషన్ పూర్తయి కడపలోని సవాని అనే ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో సాధారణ ఉద్యోగిగా జీవితాన్ని ప్రారంభించారు. పులివెందుల నియోజకవర్గంలో ఆజ్ బెస్టాస్ మైన్స్ (రాతినార)ను లీజుకు తీసుకున్నారు. కడప సమీపంలోని భాకరాపేట వద్ద పల్వరైజింగ్ మిల్లును ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఆంధ్రా ఆజ్ బెస్టాస్ పేరుతో ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పి వందలాది మందికి ఉపాధి కల్పించారు. స్వయంకృషితో పైకి వచ్చిన బ్రహ్మయ్య పేదల కష్టాలు తెలిసిన వ్యక్తి. దేవాలయాలకు, పాఠశాలలకు, పేద విద్యార్థుల చదువులకు, పెళ్లిళ్లకూ, ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో పసుపులేటి ట్రస్ట్ ద్వారా లక్షలాది రూపాయలు విరాళంగా ఇచ్చేవారు. ఈ సామాజిక సేవాతత్పరతను గుర్తించి 1993లో రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ ‘ఉత్తమ జాతీయ సేవారత్న’ పురస్కారంతో బ్రహ్మయ్యను సత్కరించారు. టీడీపీ అధ్యక్షులు ఎన్‌టి రామారావు 1994లో బ్రహ్మయ్యకు రాజంపేట శాసనసభ టికెట్ కేటాయించారు. బ్రహ్మయ్య గెలవగా, మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజలు చెప్పుకుంటారు. ‘జన్మభూమి’ కార్యక్రమాన్ని రాష్ట్రంలో అత్యుత్తమంగా అమలు చేశారు బ్రహ్మయ్య. అదేవిధంగా 2003 లో చంద్రబాబు ‘నీరు–మీరు’ పురస్కారంతో బ్రహ్మయ్యను సత్కరించారు.
కైలసాని శివప్రసాద్
(నేడు పసుపులేటి బ్రహ్యయ్య జయంతి)
ఇవి కూడా చదవండి..
డ్రోన్‌లతో సరిహద్దుల్లో పాక్ కవ్వింపులు... తిప్పికొట్టిన సైన్యం
ట్రంప్, మోదీ మధ్య నిజమైన స్నేహబంధం.. అమెరికా రాయబారి గోర్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి