ములుగు జిల్లాకు ‘సమ్మక్క సారక్క’ పేరు పెట్టాలి
ABN , Publish Date - Jan 27 , 2026 | 02:46 AM
గద్వాలకు జోగులాంబ అని, ఆసిఫాబాద్‌కు కుమరం భీమ్ అని, భూపాలపల్లికి జయశంకర్ అని నామకరణం చేసింది గత ప్రభుత్వం. ఆ తర్వాత ఏర్పడిన ములుగుకు...
గద్వాలకు జోగులాంబ అని, ఆసిఫాబాద్‌కు కుమరం భీమ్ అని, భూపాలపల్లికి జయశంకర్ అని నామకరణం చేసింది గత ప్రభుత్వం. ఆ తర్వాత ఏర్పడిన ములుగుకు మాత్రం ప్రసిద్ధి చెందిన మేడారం రణ క్షేత్రంలోని వీరవనితలైన సమ్మక్క–సారక్కలను విస్మరించింది. ఆసియా ఖండంలోనే గొప్పగా చెప్పుకుంటున్న సమ్మక్క, సారలమ్మ జాతర, దేశంలో ప్రయాగ కుంభమేళా తర్వాత అతిపెద్ద కుంభమేళా. ఈ గిరిజన జాతరకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా విస్మరించింది. అయితే ఈ గిరిజన కుంభమేళాకు ఊహించని రీతిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.251 కోట్లు కేటాయించి భిన్న సంస్కృతి గల కోయల వందేళ్ల చరిత్రకు పునర్వైభవం తీసుకురావడం శుభ పరిణామం. రాజ్యాంగం ప్రకారం ఐదవ షెడ్యూల్ భూభాగంలో నివసిస్తున్న ఆదివాసీ ఏజెన్సీ ప్రాంతాన్ని జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రత్యేక గిరిజన జిల్లాలు ఏర్పాటు చేయాలి. మేడారం పరిసర ప్రాంతాన్ని యూనిట్‌గా తీసుకొని ‘మేడారం’ను మండలంగా గుర్తిస్తూ, ములుగును ‘సమ్మక్క–సారక్క ములుగు’ జిల్లాగా పేరు మార్చాలి.
అక్షర భీమ్
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News