Share News

Communist Movement India: కుల వర్గ దృక్పథాల్ని కలిపే పోరాడాలి

ABN , Publish Date - Jan 20 , 2026 | 12:28 AM

సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ డి.రాజా 2025 జనవరి 26న ది హిందూ పత్రికలో వంద సంవత్సరాల కమ్యూనిస్ట్‌ ఉద్యమాన్ని...

Communist Movement India: కుల వర్గ దృక్పథాల్ని కలిపే పోరాడాలి

సి.పి.ఐ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్‌ డి.రాజా 2025 జనవరి 26న ది హిందూ పత్రికలో వంద సంవత్సరాల కమ్యూనిస్ట్‌ ఉద్యమాన్ని సమీక్షిస్తూ రాసిన వ్యాసంలో భారతదేశంలో కులాన్ని క్లుప్తంగా ఇలా నిర్వచించారు: ‘‘The CPI articulated the vision of a classless and casteless India, recognising caste not as a cultural residue but as a material system deeply intertwined with class exploitation’’.

కులం గురించి కామ్రేడ్‌ డి.రాజా ఇచ్చిన పై నిర్వచనం వాస్తవికంగా ఉన్నది. కుల–వర్గ దృక్పథాన్ని ప్రతిబింబిస్తూంది. పార్టీల నిర్మాణాల్లో పనిచేస్తోన్న కమ్యూనిస్టులు, నిర్మాణాల వెలుపల ఉన్న కమ్యూనిస్ట్‌ ఆలోచనాపరులు అంతా తమ విధానాల్లోను, కార్యాచరణల్లోను, నిర్మాణాల్లోను డి.రాజా చెప్తున్నట్టే, ‘‘కులాన్ని ఒక సాంస్కృతిక అవశేషంగా చూడటం గాక, వర్గ దోపిడీతో లోతుగా, జమిలిగా పెనవేసుకునిపోయి వున్న ఒక భౌతిక వ్యవస్థగా గుర్తిస్తూ, భారతదేశంలో వర్గ రహిత, కుల రహిత భారతావని స్థాపన లక్ష్యం’’ దిశగా నడవాలి. ఈ దృక్పథంలో ఇండియాలో గత వందేళ్ల కమ్యూనిస్ట్‌ ఉద్యమం ఏ మేరకు పనిచేసిందో నేడు సమీక్షించుకోవాలి. మరింత వాస్తవిక దృక్పథంతో పనిచేయాలి. వర్గ–కుల దృక్పథంతో ఉద్యమాలతోపాటు, రాజకీయ పోరాటాలు కూడా చేయాలి.

– వై.కె.

ఈ వార్తలు కూడా చదవండి...

CM Chandrababu: సీఎం చంద్రబాబుతో భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ

Tirupati Incident: తిరుపతి జిల్లాలో బీర్ల పోటీ.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 20 , 2026 | 12:28 AM