Share News

యావత్‌ దేశప్రజల విజయం

ABN , Publish Date - Mar 10 , 2026 | 12:50 AM

టీ20లో రోహిత్‌శర్మ నేతృత్వంలో 2024లో భారత్ సాధించిన విజయం ఒక చరిత్ర అయితే, 2026లో సొంతగడ్డపై ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఒక అద్భుతం...

యావత్‌ దేశప్రజల విజయం

టీ20లో రోహిత్‌శర్మ నేతృత్వంలో 2024లో భారత్ సాధించిన విజయం ఒక చరిత్ర అయితే, 2026లో సొంతగడ్డపై ఆ విజయాన్ని నిలబెట్టుకోవడం ఒక అద్భుతం. సూర్యకుమార్‌ యాదవ్ నాయకత్వంలో టీమ్ ఇండియా సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోయింది. ఈ టోర్నీలో రోహిత్ వారసత్వాన్ని అభిషేక్‌శర్మ, తిలక్‌వర్మ వంటి యువ ఆటగాళ్లు తమ మెరుపు బ్యాటింగ్‌తో కొనసాగించారు. కొలంబోలో పాకిస్థాన్‌తో జరిగిన హై–వోల్టేజ్ మ్యాచ్‌లో భారత్ సాధించిన విజయం అభిమానుల్లో పూనకాలు తెప్పించింది. ఇంగ్లాండ్‌ను ఓడించి, భారత్ ఫైనల్‌కు చేరింది. అహ్మదాబాద్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన తుది సమరంలో భారత్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించింది. సంజు శాంసన్‌, అభిషేక్‌ శర్మ ఆడిన ఇన్నింగ్స్‌, బుమ్రా యార్కర్ల మాయాజాలంతో ఆకట్టుకున్నారు. అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి వికెట్ల వేటలో కీలకంగా వ్యవహరించారు. హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తమ ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టు సమతుల్యతను కాపాడారు. ‘గడ్డ మనదే.. కప్పు మనదే’ అన్న నినాదం నిజమైంది. ఇది కేవలం ఒక ఆట గెలుపు కాదు, కోట్లాది మంది భారతీయుల ఆశల గెలుపు.

పూసపాటి వేదాద్రి

ఈ వార్తలు కూడా చదవండి..

వీల్ చైర్ నుంచి వీర యాత్ర

రైతుల రుణాలపై కేంద్రం కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 10 , 2026 | 12:50 AM