‘ఆర్థిక సంస్కరణలు–రాజ్యాంగం’పై జాతీయ సెమినార్
ABN , Publish Date - Apr 09 , 2026 | 02:24 AM
భారత ఆర్థిక వ్యవస్థను సోషలిస్టు తరహా వ్యవస్థగా 1956 పారిశ్రామిక విధానం ప్రకటించింది. మౌలిక పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలని అవసరమైతే ప్రైవేట్ రంగంలో ఉన్న...
భారత ఆర్థిక వ్యవస్థను సోషలిస్టు తరహా వ్యవస్థగా 1956 పారిశ్రామిక విధానం ప్రకటించింది. మౌలిక పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉండాలని అవసరమైతే ప్రైవేట్ రంగంలో ఉన్న వాటిని కూడా ప్రభుత్వపరం చేస్తామని చెప్పింది. మన రాజ్యాంగం కూడా సోషలిస్టు లక్ష్యాలనే కలిగి ఉంది.
అయితే రాజ్యాంగ ఉద్దేశాలకు, లక్ష్యాలకు భిన్నంగా, అలాగే అంతకుముందటి పారిశ్రామిక తీర్మానానికి వ్యతిరేకమైన విధానాలను 1991 నూతన ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాయి. మూడున్నర దశాబ్దాల తరువాత ప్రస్తుతం సమాజంపై ఈ విధానాల ప్రభావం ఎలా ఉన్నది? పౌరులకు రాజ్యాంగం ఆర్థిక, రాజకీయ, సామాజిక న్యాయాన్ని సాధించటంలో ఇప్పటివరకు ఉన్న అనుభవాలు ఏమిటి? వంటి అనే అంశాలను రాజ్యాంగం ఆధారంగా పునర్ మూల్యాంకనం చేసేందుకు ఈ నెల 9, 10 తేదీలలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జాతీయ సెమినార్ జరగనున్నది. వివిధ రంగాలలో నిపుణులైన అకడమిక్ పరిశోధకులు, న్యాయ నిపుణులు, బ్యూరోక్రాట్స్, స్వతంత్ర కార్యాచరణపరులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి, ప్రభాత్ పట్నాయక్, ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, ఘంటా చక్రపాణి, ఎ. శ్రీదేవసేన (కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్), ఈ.రేవతి, ఇనుకొండ తిరుమలి, డాక్టర్ పీవీ.రమేశ్ (రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఏపీ), ఆకునూరి మురళి (తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్), పురేంద్రప్రసాద్ , ఆర్.వి.రమణమూర్తి, టీ.సౌజన్య, ఎం.వెంకటనారాయణ, మల్లెపల్లి లక్ష్మయ్య, దుర్గం సుబ్బారావు తదితరులు ప్రసంగిస్తారు.
పట్టా వెంకటేశ్వర్లు (సెమినార్ డైరెక్టర్)
కె. కృష్ణారెడ్డి (కో డైరెక్టర్)
ఈ వార్తలు కూడా చదవండి..
హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ
తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు
For More AP News And Telugu News