నేడు డీటీయూ రాష్ట్ర విద్యా సదస్సు
ABN , Publish Date - Aug 26 , 2026 | 02:16 AM
అందరికీ విద్య అనే లక్ష్యాన్ని రాజ్యాంగం ‘విద్యా హక్కు చట్టం’ ద్వారా చట్టబద్ధం చేసింది. కానీ ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో కూడా అట్టడుగువర్గాల పిల్లలకు నాణ్యమైన, సమాన విద్య అందడం లేదు....
అందరికీ విద్య అనే లక్ష్యాన్ని రాజ్యాంగం ‘విద్యా హక్కు చట్టం’ ద్వారా చట్టబద్ధం చేసింది. కానీ ఎనిమిది దశాబ్దాల స్వాతంత్ర్య భారతంలో కూడా అట్టడుగువర్గాల పిల్లలకు నాణ్యమైన, సమాన విద్య అందడం లేదు. ప్రభుత్వ బడుల్లో తరగతి గదులు, తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, ప్రహరీ, గ్రంథాలయాలు, ప్రయోగశాలలు వంటి కనీస సౌకర్యాల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రభుత్వ గణాంకాల్లో మౌలిక వసతులు ఉన్నట్లు చూపుతున్నా... క్షేత్రస్థాయి వాస్తవాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ విద్యపై పెట్టుబడులు తగ్గడం, విద్యా రంగంలో ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ పెరగడం సామాజిక అసమానతలను మరింత తీవ్రం చేస్తున్నాయి. విద్యా వ్యవస్థలోని ఈ వైఫల్యాలను ప్రశ్నించకుంటే భావి పౌరుల భవిష్యత్ అంధకారమే. ఈ నేపథ్యంలో నేడు ధర్మ టీచర్స్ యూనిటీ (డీటీయూ) రాష్ట్ర స్థాయి విద్యా సదస్సు హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనుంది. సమస్త విద్యారంగం ఎదుర్కోబోతున్న సవాళ్లు, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం.. తద్వారా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కలిగే నష్టం తదితర అంశాలపై చర్చకు ఈ సదస్సు వేదిక కాబోతున్నది.
సంపతి రమేష్
డీటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ పిల్లాడి టాలెంట్‌కు ఫిదా.. వీడియో వైరల్
చెత్తకుప్పలో చాక్లెట్లు.. ఎగబడిన జనం.. వీడియో వైరల్
For More TG News And Telugu News