Share News

విజయ శంఖం

ABN , Publish Date - Oct 20 , 2026 | 05:29 AM

పిండివంటల ఘుమఘుమలు కావు, కొత్త వస్త్రాల మెరుపులు కావు, ఆడంబరాల పూజలు అంతకన్నా కావు...

విజయ శంఖం

పిండివంటల ఘుమఘుమలు కావు,

కొత్త వస్త్రాల మెరుపులు కావు,

ఆడంబరాల పూజలు అంతకన్నా కావు...

దసరా ఒక ఆత్మ జాగృతి!

బాహ్య శత్రువుల సంహారం కాదు,

నీలోనే దాగున్న నల్లని చీకట్లపై సమరం!

సత్త్వ గుణాల సింహాసనం,

దుర్గుణాల దహనకాండం!

మాటైనా... చేతైనా...

మంచితనపు అక్షయపాత్ర కావాలి!

ప్రయోగించే ప్రతి శబ్దాస్త్రం

సమాజపు గాయాలను మాన్పే సంజీవని కావాలి

పట్టే ఆయుధమేదైనా...

స్వార్థాన్ని తుంచే న్యాయఖడ్గం కావాలి

కృపా రహిత జగతిపై కురిసే కరుణా వర్షం కావాలి!

మంచితనమే పరమావధిగా,

సత్యనిష్ఠే మహాస్త్రంగా,

చెడుపై సాధించే ప్రతి గెలుపూ...

అసలైన విజయదశమి!

తూలుగు రమణారావు

ఈ వార్తలూ చదవండి:

విజయవాడ ఉత్సవ్ ముగింపు వేడుకలు.. 2 వేల మంది కళాకారులతో దసరా కార్నివాల్

టైగర్‌ ష్రాఫ్‌పై హత్యాయత్నం

టైగర్‌ ష్రాఫ్‌పై కాల్పుల ఘటన.. బయటకొచ్చిన నిందితుల ఫొటో

Updated Date - Oct 20 , 2026 | 05:30 AM