Share News

సీఈసీ తొలగింపు అంత సులభం కాదు!

ABN , Publish Date - Oct 16 , 2026 | 02:53 AM

సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో రుజువులు చూపిస్తున్న ఉద్యమకారులు ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారే కానీ, తొలగించాలని డిమాండ్ చేయలేకపోతున్నారు. కారణం...

సీఈసీ తొలగింపు అంత సులభం కాదు!

సర్ ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో రుజువులు చూపిస్తున్న ఉద్యమకారులు ఆయన రాజీనామా చేయాలని కోరుతున్నారే కానీ, తొలగించాలని డిమాండ్ చేయలేకపోతున్నారు. కారణం– ఎన్నికల సంఘం సభ్యుల నియామక ప్రక్రియలో చోటుచేసుకున్న మార్పులే. ప్రస్తుతం అమల్లో వున్న నిబంధనల ప్రకారం ఎన్నికల సంఘం ప్రధాన అధికారికి పటిష్ఠమైన రక్షణ వ్యవస్థ ఉంది. తనంతట తానుగా ఆయన రాజీనామా చేస్తే మినహా తొలగించడం లేదా బర్తరఫ్ చేయడం సులభం కాదు. రాజ్యాంగం ప్రకారం ఆయనను తొలగించాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని తొలగించే పద్ధతిని పాటించాలి. సీఈసీని తొలగించే పద్ధతిని అభిశంసించడం అంటారు. ఇందుకు 100 లోక్‌సభ లేదా 50 మంది రాజ్యసభ సభ్యలు స్పీకర్/రాజ్యసభ ఛైర్మన్‌కు నోటీసు అందజేయాలి. ఆ తర్వాత సీఈసీపై వచ్చిన ఆరోపణలపై ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ విచారణ జరపాలి. ఉభయ సభలలోనూ మూడింట రెండొంతుల మంది సభ్యులు ఆమోదంతో తీర్మానం నెగ్గాలి. దానిని రాష్ట్రపతి ఆమోదించినప్పుడు మాత్రమే చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను తొలగించడం సాధ్యం అవుతుంది. సీఈసీ రాజీనామా చేయాలంటూ దేశ రాజధాని అట్టుడికిపోతున్నా జ్ఞానేష్‌కుమార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉండడానికి కారణం ఇదే.

అన్నవరపు బ్రహ్మయ్య

Also Read:

సిక్కిం గవర్నర్ నియామకంపై నిరసన.. అంకిత భండారీ తల్లిదండ్రుల విడుదల

జంతర్ మంతర్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. కేంద్రానికి నోటీసులు

గుజరాత్‌లో దారుణం.. నగల కోసం ప్రాణాలు తీసేశారు

Updated Date - Oct 16 , 2026 | 02:53 AM