Share News

ఏపీలో సినిమా షూటింగులు జరపాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 01:02 AM

ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగులను ఎక్కడో దూర ప్రాంతాల్లో జరుపుతున్నారు. అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా షూటింగులు జరపాలి...

ఏపీలో సినిమా షూటింగులు జరపాలి

ప్రస్తుతం తెలుగు సినిమా షూటింగులను ఎక్కడో దూర ప్రాంతాల్లో జరుపుతున్నారు. అలా కాకుండా మన ఆంధ్రప్రదేశ్‌లోనే సినిమా షూటింగులు జరపాలి. మన రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా (కృష్ణా, గోదావరి నదీ తీరాలు), రాయలసీమతో పాటు, తిరుపతి, లేపాక్షి... వంటి ప్రాంతాల్లో అందమైన లొకేషన్‌లు ఎన్నో ఉన్నాయి. రాష్ట్ర దేవాదాయశాఖ అనుమతితో ఆలయ పరిసరాల్లోనూ సినిమా షూటింగులను జరుపుకోవచ్చు. ఈ షూటింగుల వల్ల ప్రభుత్వానికి ఆదాయం లభిస్తుంది. నూతన రాజధాని అమరావతి కూడా తెలుగు సినిమా షూటింగులకు మరింత అనుకూలం కాగలదు. తెలుగు కళా వైభవం ఉట్టిపడేలా మన ప్రాంతంలోనే సినిమా షూటింగులు జరపడం వల్ల మన ప్రాచీన సంస్కృతిని అందరికీ తెలియజేయవచ్చు.

ఎల్. ప్రఫుల్లచంద్ర

ఈ వార్తలు కూడా చదవండి...

బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణంపై కేసీఆర్ స్పెషల్ ఫోకస్..

మంత్రి శ్రీధర్ బాబుతో నార్వే ప్రతినిధుల కీలక భేటీ

ప్రభుత్వంతో చర్చలు విఫలం.. ఆర్టీసీ కార్మికుల సమ్మె బాట

Read Latest Telangana News And AP News And International

Updated Date - Apr 23 , 2026 | 01:02 AM