కారుణ్య నియామకాలు అవసరం
ABN , Publish Date - Jan 27 , 2026 | 12:51 AM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోంది. మౌలిక వసతుల...
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యారంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తోంది. మౌలిక వసతుల అభివృద్ధి, విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయి. గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే ప్రభుత్వ సంకల్పం ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ద్వారా స్పష్టంగా కనిపిస్తోంది. వీటితో పాటు ఈ స్కూల్స్‌లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉపాధ్యాయులు, సిబ్బందికి ఉద్యోగ భద్రత కలిగించే చర్యలు కూడా అవసరం. ముఖ్యంగా సర్వీస్ రూల్స్ అమలు, ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ స్కీమ్ వంటి అంశాలు ఎంతో కీలకం. అదేవిధంగా, కారుణ్య నియామకాలు కూడా మానవీయమైన, కీలకమైన విషయం. సిబ్బంది మృతిచెందిన సందర్భాల్లో, కుటుంబ సభ్యులకు ఉద్యోగం కల్పించే అవకాశం ప్రస్తుతం లేకపోవడం తీవ్ర ఆవేదనను కలిగిస్తోంది. కారుణ్య నియామకాల అమలుకు అవసరమైన అన్ని రకాల చట్ట సవరణలు, నిబంధనల సడలింపు వంటి అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకొని అమలు చేయాలి.
బి.సురేష్
ఈ వార్తలు కూడా చదవండి...
మా అక్క మాట్లాడటం లేదు.. కానిస్టేబుల్ సౌమ్య సోదరుడి ఆవేదన
ఆర్టీసీ డ్రైవర్ నాగరాజుకు గుండెపోటు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే..
Read Latest Telangana News And Telugu News