Share News

అసత్యాలు, ఊహాగానాల వ్యాసం

ABN , Publish Date - Apr 28 , 2026 | 12:24 AM

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో పాటించే ప్రమాణాలపై గౌరవం ఉంది. కానీ, ఏప్రిల్‌ 14న ప్రచురించిన– ‘అంబేడ్కర్ తొలి ప్రధాని అయివుంటే...’

అసత్యాలు, ఊహాగానాల వ్యాసం

ఆంధ్రజ్యోతి ఎడిట్ పేజీలో పాటించే ప్రమాణాలపై గౌరవం ఉంది. కానీ, ఏప్రిల్‌ 14న ప్రచురించిన– ‘అంబేడ్కర్ తొలి ప్రధాని అయివుంటే...’ (బీజేపీ తెలంగాణ ఉపాధ్యక్షులు బూర నర్సయ్యగౌడ్‌) వ్యాసం చాలా అభ్యంతరకరంగా ఉంది. అసత్యాలు, అర్ధసత్యాలు, ఊహాగానాలు, అతిశయోక్తులను గుదిగుచ్చి రాసిన వ్యాసం ఇది. దానిలోని వైరుధ్యాలను గుర్తుపట్టడానికి చరిత్ర అవగాహన కూడా అవసరం లేదు. self–evident స్పష్టంగా ఉంది. ప్రజాసమ్మతి లేని రాజకీయ విలువలకు, ఆ విలువలను అమ్మడం కోసం, ఆ విలువలకు సమ్మతిని, సాధికారతను ఉత్పత్తి చేయడం కోసం, ఆ విలువలనే ఎదిరించిన జాతీయ నాయకులను, వారి పేర్లను వాడుకోవడం, వారి చుట్టూ ఊహాగానాలు అల్లడం, ఇలాంటి పనులకు మీ పత్రికలో స్థానం ఇవ్వడం బాధాకరం. మొన్నటి వరకు పటేల్ ప్రధాని అయివుంటే.. అని ఊదరగొట్టినవారు, ఈ రోజు అంబేడ్కర్ ప్రధాని అయివుంటే.. అని తోచినవన్నీ రాశారు. హైదరాబాద్‌ను ఇండియాలో ఇంకా ముందే ‘విలీనం’ చేసేవాడు అంటారు. ఆ ఊహలలో కూడా ఒక నియమం, స్థిరత్వం లేదు. ఇదే ధోరణిలో రేపు ఇంకో జాతీయ నాయకుడి జయంతినాడు వీరు ఇదే తరహాలో వ్యాసం రాసినా నేను ఆశ్చర్యపోను. మీరు ప్రచురిస్తే మాత్రం.. ఒక పాఠకుడిగా ఆశ్చర్యపోతాను.

ఆనంద్‌, పీహెచ్‌డీ విద్యార్థి, పాండిచ్చేరి

ఈ వార్తలు కూడా చదవండి..

తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఒక్కరూ అడ్డుకోలేదు: కేసీఆర్

కవిత కొత్త పొలిటికల్ పార్టీని ఎందుకు పెట్టారో చెప్పండి కేటీఆర్: ఎమ్మెల్యే సామేల్

For More AP News And Telugu News

Updated Date - Apr 28 , 2026 | 12:34 AM