Share News

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనంలో కీలక మార్పులు..

ABN , Publish Date - Jul 19 , 2026 | 08:51 AM

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి స్పర్శ దర్శనంలో కీలక మార్పులు..
New Sparsha Darshan Rules

నంద్యాల: శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు దేవస్థానం ఛైర్మన్ రమేశ్ నాయుడు, కార్యనిర్వహణాధికారి (ఈవో) శ్రీనివాసరావు దర్శన మార్పులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.


అధికారుల వివరాల ప్రకారం.. ఇకపై శని, ఆదివారాలు, సోమవారాల్లో ఉదయం వేళ మనమిత్ర వాట్సాప్, ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా టికెట్లు పొందిన భక్తులకు మాత్రమే విరామ (స్పర్శ) దర్శనానికి అనుమతి ఉంటుంది. ప్రముఖులు స్వయంగా ఆలయానికి విచ్చేసిన సందర్భాల్లో ప్రాధాన్యత ఆధారంగా ఉదయం స్పర్శ దర్శనం కల్పించనున్నారు. సిఫారసు లేఖలతో వచ్చే భక్తులకు ఉదయం వేళల్లో స్పర్శ దర్శనాన్ని పూర్తిగా నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారు. వారికి అవకాశం ఉన్న మేరకు రాత్రి 9 గంటల సమయంలో మాత్రమే స్పర్శ దర్శనానికి అనుమతి ఇవ్వనున్నట్లు వెల్లడించారు.


అదేవిధంగా సర్వదర్శనం, ఉచిత దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనానికి వచ్చే భక్తులకు మరింత సమయం కేటాయించేలా చర్యలు చేపట్టినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ మార్పుల వల్ల సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం మరింత మెరుగుపడుతుందని పేర్కొన్నారు. కొత్త విధానాలను భక్తులు గమనించి దేవస్థాన సిబ్బందికి సహకరించాలని ఈవో శ్రీనివాసరావు, ఛైర్మన్ రమేశ్ నాయుడు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

జులై 19 నుంచి అమర్‌నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత..

విశాఖలో ఘోర రోడ్డుప్రమాదం.. కారు, లారీ ఢీకొని నలుగురి మృతి..

Updated Date - Jul 19 , 2026 | 08:53 AM